ఏపీలో ఎన్నికల వేడి బాగా రాజుకుంది. వైసీపీ అభ్యర్ధులను ఎంపిక చేసి  మొత్తం లిస్ట్ ని విడుదల చేసి బాగా ముందుంది. టీడీపీ పది అసెంబ్లీ సీట్లకే లిస్ట్ విడుదల చేసింది. జనసేన నుంచు అరడజన్ మంది మాత్రమే అభ్యర్ధులు ఖరార్ అయ్యారు. ఇపుడున్న పొలిటికల్ సీన్ జిల్లాలో వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది.


ఇదిలా ఉండగా వైసీపీలోకి అవంతి శ్రీనివాస్ రావడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా  మారిపోయాయి. వైసీపీ బాగా  బలపడగా టీడీపీకి కంచుకోటలాంటి భీమిలీలో అభ్యర్ధులే లేని దుస్థితి దాపురించింది. ఇక విశాఖ ఎంపీ సీటును ఇప్పటికీ ఆ పార్టీకి ఎవరు  అభ్యర్ధి అన్నది తేల్చుకోలేకపోతోంది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ  మొదలైంది. దాంతో వైసీపీ ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే ఇపుడు వైసీపీకి సానుకూలంగా మారుతున్నాయి.


వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో మొత్తం పదిహేను స్థానాలకు గాను 12 సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీకి అనుకూలంగా బలమైన గాలి వీస్తోందని, దాంతో విశాఖలో టీడీపీ జాతకం తారుమారు అవుతుందని ఆయన అన్నారు. ఆయన చెప్పడం కాదు కానీ ఇప్పటికీ అభ్యర్ధుల సెలెక్షన్ చేసుకోలేక టీడీపీ ప్రచారంలో వెనకబడిందనే చెప్పాలి. ఇదే సీన్  కంటిన్యూ అయితే అది వైసీపీకి కలసివస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: