నెల్లూరు జిల్లాలోనే కావలిలో ఇప్పుడు రసవత్తర పోరు నెలకొనివుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిన ఈ సీటులో ఈసారి వైసీపీ గెలుస్తుందా? లేక తెలుగుదేశం పార్టీ జెండా పాతుతుందా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. తెలుగుదేశం పార్టీ తరఫున బీద మస్తాన్ రావుకు ముందుగా అభ్యర్థిత్వం ఖరారు అయినా.. ఆ తర్వాత అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. మస్తాన్ రావు నెల్లూరు ఎంపీ సీటుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కావలిలో పరిణామాల్లో మరో మార్పు కనిపిస్తూ ఉంది. మొన్నటివరకూ అయితే కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీనే కాస్తంత లీడ్ లో కనిపించింది.

Image result for tdp ysrcp janasena

అయితే అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి మారడం ఇక్కడ కథను మారుస్తూ ఉందని స్పష్టం అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు ప్రధాన కారణం రాజకీయ పరమైన రీజన్లే. రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి అంశాల ప్రభావం ఈ నియోజకవర్గం మీద తక్కువగానే కనిపిస్తూ ఉంది. అలాగని తెలుగుదేశం పార్టీకి నల్లేరు మీద నడక కాదు. జనసేన ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంది. బలిజల జనాభా ఒక కారణం అయితే, ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి జనసేన టికెట్ కేటాయించడంతో.. ఆ సామాజికవర్గం కూడా అటు వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి.

Image result for tdp ysrcp janasena

జనసేన పోటీ అటు తెలుగుదేశం ఓటు బ్యాంకుకు, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పెడుతూ ఉంది.  కావలి టౌన్లో పద్దెనిమిది వేల చిల్లర స్థాయిలో ఉన్న వైశ్య సామాజికవర్గం ఓట్లు ఈ సారి ఎటు వైపు మొగ్గుచూపుతాయి అనేది ఆసక్తిదాయమైన అంశం. ఇక్కడ జనసేన అభ్యర్థి ఆర్థిక శక్తి గురించి జనాలు కథలు కథలుగా చెప్పుకొంటూ ఉన్నారు. వంద కోట్ల రూపాయలకు అధిపతి అట! ఇప్పుడు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేయగలగరట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉండటంతో..తెలుగుదేశం పార్టీకి పూర్తి అడ్వాంటేజీగా మారాల్సిందే. అయితే జనసేన ఎంట్రీతో.. త్రిముఖ పోరు ఖాయమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: