ఎన్నికలు అన్నాక చాలా కధ ఉంటుంది. ఒక సీటు నుంచి అనేకమంది పోటీ పడతారు. టికెట్లు ఆశిస్తారు. అయితే అధినాయ‌కత్వం అందరికీ టికెట్లు ఇవ్వడం కుదరదు, దాంతో వారికి ఉన్న సమాచారం ప్రకారం ఎంపిక చేస్తారు. అయితే ఆ సమయంలో మిగిలిన వారు అసంత్రుప్తిలో ఉంటారు. వారే పార్టీకి ఎదురుతిరుగుతారు.


 విశాఖ జిల్లాలో అటువంటి వారికి   ఇపుడు జగన్ తనదైన స్టైల్లో నమ్మకమైన అభయం ఇస్తున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమని, ఇవాళ  కాకపోతే రేపు వారిని అన్ని విధాలుగా అదుకుంటానని జగన్ గట్టి హామీ ఇస్తున్నారు. అలా విశాఖ జిల్లాలో సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు ఓ హామీ దక్కింది. ఆయన్ని ప్రభుత్వంలో వస్తే తగిన గౌరవం ఇస్తామని వైసీపీ హై కమాండ్ చెప్పింది. అంతే కాదు. దాడి వీరభద్రరావుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఇచ్చింది. ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కూడా సూచించింది.


ఇక విశాఖ సౌత్ లో టికెట్లు రాలేదని ఆవేదన చెందుతున్న నాయకులను కూడా జగన్ తరఫున నాయకులు బుజ్జగిస్తున్నారు. ఇవాళ పార్టీని గెలిపించుకోవాలని, రేపు అధికారం లోకి తప్ప‌కుండా వస్తామని  అపుడు అనేక అవకాశాలు ఉంటాయని కూడా నచ్చచెబుతున్నారు. దాంతో నిన్నటి వరకూ అలకలు మీదున్న నేతలు ఇపుడు గాడిలో పడుతున్నారు. ఈ పరిణామలు  వైసీపీకి ఇపుడు ఆనందాన్నిస్తున్నాయి. గతంలో లేని విధంగా జగన్ ఇస్తున్న హామీలు నేతలకు భరోసాగానే ఉంటున్నాయని పార్టీలో నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: