ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. వైసీపీ అన్ని సీట్లు  దాదాపుగా కొత్తవారికే ఇచ్చేసింది. అదే టైంలో టీడీపీ అభ్యర్ధులు జనాలకు పరిచయం అయిన  వారు కావడం ఇపుడున్న పరిస్తితుల్లో అడ్వాంటేజ్ గా ఉంది. శ్రీకాకుళం ఎంపీ సీటు తీసుకుంటే టీడీపీ తరఫున మళ్ళీ రామ్మోహననాయుడే పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ ని ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టింది. ఆయనది బలమైన కాళింగ సామాజిక వర్గం కావడంతో పాటు గత పదేళ్ళుగా ఎన్నికల్లో వరసగా పోటీ చేస్తూ వస్తున్నారు. ఐతె గెలుపు మాత్రం పలకరించడంలేదు. ఇపుడు ఏకంగా శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ పడుతున్నారు. దువ్వాడ కుటుంబం కూడా రాజకీయ నేపధ్యం కావడం, జగన్ ఫ్యాక్టర్ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఐతే రామ్మోహననాయుడు కూడా దూకుడు రాజకీయం చేస్తారు. దాంతో దువ్వాడ ఆయన్ని తట్టుకుని నిలబడాల్సిఉంటుంది.


ఇక విజయన‌గరం విషయానికి వస్తే ఇక్కడ బెల్లాల చంద్రశేఖర్ వైసీపీ ఎంపీగా నిలబడుతున్నారు. అక్కడ చూస్తే పూసపాటి వంశీకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బిగ్ ఫిగర్  పోటీ చేస్తున్నారు. ఆయన్ని ఢీ కొట్టి బెల్లాల ఎంతవరకూ నిలబడగరన్నది చూడాలి. సీనియర్ నేత బొత్సకు దగ్గర చుట్టం కావడం, బలమైన కాపు సామాజిక వర్గం అండగా ఉండడం, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి అనుభవం ఉండడం బెల్లాలకు ప్లస్ పాయింట్లు. మరో వైపు వైసీపీ గాలి కూడా ఉండడం ఎంపీ పరిధిలో మెజార్టీ సీట్లలో అనుకూలత  వైసీపీ వైపుగా ఉండడం గెలుపునకు అవకాశంగా ఉన్నాయి.


విశాఖ జిల్లా అరకు సీటు తీసుకుంటే రాజకీయ భీష్ముడు ఐన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తో వైసీపీ అభ్యర్ధి గొట్టేటి మాధవి పోటీ పడుతోంది. తండ్రి సీపీఐ తరఫున చింతపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన నేత. దాంతో ఆ పట్టుతో పాటు, ప్రభుత్వ టీచర్ గా, సామాజిక చైతన్యం కలిగినగిరిజన మహళా  నేతగా మాధవి ఉన్నారు. ఇక్కడ వైసీపీకి గిరిజనుల్లో ఆదరణ ఉండడం మాధవికి కలసివస్తుందని భావిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో తప్ప కిశోర్ చంద్రదేవ్ జనాలకు పెద్దగా కనబడరన్న విమర్శలు కూడా వైసీపీకి  ప్లస్ పాయింట్లు అవుతాయి అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: