గుడివాడ అంటే టీడీపీకి కంచుకోట. అలాంటిది ఇప్పుడు కొడాలి నానీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకూ నానికి ఓటమి లేదు.2004లో, 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాడు. 2014లో వైకాపా నుండి పోటీ చేసి 11000 మెజారిటీతో గెలిచాడు. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకున్నాడు. చంద్రబాబుకి, టీడీపీకి కొరకరాని కొయ్యగా మారాడు. ఎప్పుడూ చంద్రబాబుపై పరుష పదజాలంతో విరుచుకుపడుతూ ఉంటాడు. అలాంటి కొడాలి నాని మీదకి చంద్రబాబు యువకేరటం దేవినేని అవినాష్‌ని వదిలారు.


అయితే నానికి అవినాష్ ఎంత వరకూ పోటీ ఇస్తాడనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే అవినాష్ నియోజకవర్గానికి నాన్ లోకల్. గుడివాడ గడ్డ మీద  టీడీపిలో ఉద్దండపిండులైన రాజకీయ నేతలున్నారు. మాజీ మంత్రి ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఈ టికెట్ ఆశించారు. అలాగే గుడివాడ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ పిన్నమనేని బాబ్జీ,  మాజీ ఎమ్మెల్యే,  నిన్నమొన్నటి వరకూ నియోజకవర్గ ఇన్-చార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు కూడా సీటు ఆశించారు. అటు మున్సిపాల్ ఛైర్మన్‌గా ఉన్న యలవర్తి శ్రీనివాసరావు కూడా టికెట్ ఆశించారు.


కానీ చంద్రబాబు వీళ్ళందరినీ కాదని అవినాష్‌ని రంగంలోకి దింపారు. పైగా వీళ్ళందరినీ బుజ్జగగించి ఒక కొలిక్కి తేవడానికే బాబుకు చాలా టైమ్ పట్టింది. అవినాష్ కూడా వీరి ఆశీర్వదాలు తీసుకోడానికి కూడా చాలానే సమయం పట్టింది. ఇక ఇప్పుడిప్పుడే అవినాష్’ ప్రచారంలోకి వెళ్తున్నాడు. అటువైపు  సింహంలా ఉన్నాడు నాని. అవినాష్ జూనియర్ అవ్వడం.., అందులోనూ ఇవ్వటం ఇవ్వటమే చంద్రబాబు అవినాష్‌కి గుడివాడ ఇచ్చారు. ఇటు చూస్తే కొడాలి నాని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. మళ్ళీ గెలుస్తానని సవాల్ విసురుతున్నాడు.


అవినాష్ ఎంత వరకూ పోటీ ఇస్తాడు అనేది సందేహం అంటున్నారు. వీళ్లేమో గెలుస్తాం అంటున్నారు. టీడీపీలోని అసంతృప్తుల్ని నాని కాష్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. నాని వ్యూహాల ముందు అవినాష్ నెగ్గుతాడా అనేది ప్రశ్నత్మాకంగానే ఉంది. ఇదంతా చూస్తుంటే అవినాష్ కొట్టడం కష్టమేనేమో అనిపిస్తుంది. అయినా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసును. ఏం జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: