Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 2:27 am IST

Menu &Sections

Search

వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?

వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. వివేకా ప్రధాన అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. హత్యకు ముందు, ఆ తర్వాత ఈ నేతలిద్దరి మధ్య తరచూ ఫోన్‌ సంభాషణ జరిగినట్టు తేలడంతో అటు వైపు దృష్టి పెట్టింది. వీళ్లతో కడప జిల్లాకు చెందిన కొంత మంది టీడీపీ నేతలు మాట్లాడినట్టు వార్తలుప్రచారంలో ఉన్నాయి.  వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించేందుకు సిద్ధమవుతోంది సిట్.మాజీమంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి ధారుణ హత్యకేసులో ఆధారాల సేకరణ సిట్‌ అధికారులకు అతి క్లిష్టంగానే కాదు, సవాలు గా మారుతోంది. క్లూస్‌టీం సేకరించిన ఘటనాస్థలిలో సందర్భానుసార సహజ సాక్ష్యాలు, విచారణలో లభించిన ఆధారాలతో పాటు, సాంకేతిక సాక్ష్యాలపైనా వారు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
ap-news-telangana-news-ex-minister-ys-vivekananda- 
మాజీ ఎంపీ, వైసీపీ నేత, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్య తర్వాత నుంచి కనిపించ కుండా పోయిన ఆయన సన్నిహితుడు పరమేశ్వరరెడ్డి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అతడు అనారోగ్యంతో తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించారు. అయితే, తనకు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 
ap-news-telangana-news-ex-minister-ys-vivekananda-
అంతేకాదు, హత్య జరిగిన రోజు వివేకా ఇంటి తలుపు తీసినవాళ్లే హత్య చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్య ఇంటి దొంగలపనే అయ్యుంటుందని, వారే అతడి ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

జగన్మొహనరెడ్ది ముఖ్యమంత్రి అయితే వివేకానందరెడ్డి బలమైన రాజకీయశక్తిగా ఎదిగేవాడని, కానీ ఆయన ఎదుగుదల చూడలేని వాళ్లే హత్యచేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అతడిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా పరమేశ్వరరెడ్డి భార్య, కుమారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ap-news-telangana-news-ex-minister-ys-vivekananda-

మరోవైపు, హత్య జరగడానికి వారం రోజుల ముందే బీ కేర్ ఫుల్ అన్న SMS అజ్ఞాత వ్యక్తి నుంచి వివేకా మొబైల్‌కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.  

ఆ మెసెజ్ ఏ నెంబరు నుంచి వచ్చింది?
అది ఎవరిది?

అన్న విషయంపైనా విచారణ జరుపుతున్నారు.  పది రోజుల్లో ఒక సంచలనాన్ని వింటారు--- అని తన అనుచరులతో పరమేశ్వరరెడ్డి చెప్పినట్టు పోలీసుల దృష్టికి రాగా, అది వివేకా హత్యేనా? అన్న కోణంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ప్రధాన నిందితులుగా భావిస్తున్న గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి కాల్ డేటాలో కొంత మంది టీడీపీ నేతల పేర్లు కూడా ఉన్నాయని గుర్తించిన అధికారులు, వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. 
ap-news-telangana-news-ex-minister-ys-vivekananda-
వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత చెప్పి మీడియాను, బంధువులను తప్పుదారి పట్టించింది కూడా గంగిరెడ్డే నని భావిస్తున్నారు. వివేకా గుండెపోటు తో ఆయన మరణించారని ఆయన పీఏ కృష్ణారెడ్డి ద్వారా అవినాష్ రెడ్డికి చెప్పించారని, ఘటనాస్థలికి రాకుండా, మృత దేహాన్ని చూడకుండా కొందరు కుటుంబసభ్యులు అదే విషయాన్ని చెప్పారని సిట్ అధికారులు ధ్రువీకరించారు. 
ap-news-telangana-news-ex-minister-ys-vivekananda-
హత్య వెనుక ₹125 కోట్ల వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని అధికారులు భావిస్తున్నారు. హత్యకు 15 రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వివేకా- గంగిరెడ్డి- పరమేశ్వరరెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీల విషయం లో భెదాభిప్రాయాలు వచ్చినట్టు గుర్తించారు.


వివేకాకు తెలియకుండానే గంగిరెడ్డి నాలుగైదు ఎకరాలు అమ్మే ప్రయత్నం చేశాడని, అందుకుగాను గంగిరెడ్డి కి ₹1.75 కోట్లు  వచ్చిందట. ఈ విషయం బయటపడితే,  హత్యకు సూత్రదారి ఎవరన్నది తేలనుంది. దీంతో భూ వివాదం వివేకానందరెడ్డి తో పాటు ఎవరికి మధ్య నడుస్తుందనేది తేలనుంది.


ఈ దిశగా దర్యాఫ్తు వేగవంతం చేసిన అధికారులు, వ్యవహారం  మొత్తం ఎర్ర గంగి రెడ్డి, పరమేశ్వరరెడ్డి చుట్టూనే తిరుగుతోంద ని, వారు నోరు విప్పితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు 
ap-news-telangana-news-ex-minister-ys-vivekananda-
రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఒక భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ డీల్ కు సంబంధించి ₹1.75 కోట్ల లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు  తెలుస్తోంది. డీల్‌ వల్ల తమకు నష్టం కలగరాదనే ఉద్దేశంతో గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డి చేతులు కలిపారని, వివేకా హత్యకు నాలుగు రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేశారని అధికారులు అంటున్నారు.


మరోవైపు నాలుగు రోజులుగా రహస్య  ప్రాంతంలో గంగిరెడ్డిని విచారిస్తోంది సిట్. ఆయన చెప్పిన వివరాలు ఆధారంగా పరమేశ్వరరెడ్డిని విచారించనున్నారు. అటు అవినాష్‌ రెడ్డి, వివేకానంద భార్య నుంచి కూడా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు.

ap-news-telangana-news-ex-minister-ys-vivekananda-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“మోదీ కూడా టివీ చూస్తున్నారు జాగ్రత్త!": నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
కేసీఆర్ నాడు అందరివాడు - నేడు ఒంటరి వాడు! గమనిస్తున్న జన తెలంగాణా
విలువలే లేని ఈ రాజకీయ నేతని చూసి జాతి మొత్తం సిగ్గుపడాలి!
నరేంద్ర మోదీకి ఓటు వేయటం తప్ప భారతీయులకు వేరే దారి లేదంటున్న విశ్వ విజేత
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
నైజాం భూగర్భం వజ్రాలమయం - బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
About the author