ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనంతపూర్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కరువు సీమగా పేరు తెచ్చుకున్నప్పటికీ రాజకీయ చైతన్యం ఎక్కువే. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. మొత్తం 14 స్థానాలలో 11 సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఆ పార్టీ కీలక నేత పయ్యావుల కేశవ్ కు ఉరవకొండలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయం సాధించి మంత్రి పదవి చేపట్టాలని భావించిన పయ్యావులకు వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి చెక్ పెట్టారు. 2 వేల పైచిలకు ఓట్లతో ఆయన విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే పయ్యావుల, పట్టు నిలుపుకోవాలని వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి భావించడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుంది. 2004 నుంచి ఇక్కడ 3 సార్లు పోటీ చేసిన విశ్వేశ్వరరెడ్డి 2సార్లు ఓడిపోయి గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 1999 నుంచి 4 సార్లు పోటీ చేసిన పయ్యావుల కేశవ్ రెండుసార్లు గెలుపొంది మరో రెండుసార్లు ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లోనూ వీరిద్దరే తిరిగి పోటీ చేయబోతున్నారు. అలాగే జనసేన కూడా తొలిసారి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జనసేన ఇతర పార్టీ నేతలు ఎవరు అనేది ఇంకా తేలాల్సివుంది. ప్రధాన పోటీ మాత్రం అధికార, విపక్షాల మధ్యే ఉండే అవకాశముంది. దీంతో ఇద్దరి నేతలు వారి పట్టుపెంచుకొని విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అభివృధి కార్యక్రమాలు పెద్దగా జరగలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రజలను సరిగా పట్టించుకోవట్లదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా పయ్యావుల ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకొని తన పట్టు నిరూపించుకోటానికి కొన్ని పనులు చేస్తూ ప్రజల్లో తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ జనసేన నాయకులు కూడా కొంత ఆర్భాటం చేస్తున్నారు. అయితే విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న చేయగలిగిన అభివృద్ధి చేశానని, తనపై ఎంటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం ఇవే తనని గెలిపిస్తాయని విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. అలాగే జనసేన కూడా ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉరవకొండలో పాగా వేసేది ఎవరని సర్వత్ర ఆసక్తి నెలకొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: