గుంతకల్ నియోజకవర్గం ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ కు హెడ్క్వార్టర్స్ గా ఈ డివిజన్ ఉంది. 2009 లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొట్రికే మధుసూధన్ 9,344 ఓట్ల మెజారిటీతో టీడీపీ నేత సాయినాథ గౌడ్ పై గెలుపొందారు. ఆ తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయి ఈ నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంది. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన ఒక శాపంగా మారింది.


2014 లో టీడీపీ నుంచి పోటీ చేసిన జితేంద్రగౌడ్ 5,094 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి వెంకటరామిరెడ్డి పై గెలుపొందారు. అయితే 2019 లో జరిగే ఎన్నికలకు వైసీపీ నుంచి మళ్లీ వెంకటరామిరెడ్డి కే అవకాశం దక్కింది. టీడీపీ పార్టీ నుంచి వెలువడ్డ 125 సీట్ల స్థానాల లిస్ట్ లో గుంతకల్ నియోజకవర్గం లేకపోవడం కాస్త ఉత్కంఠ రేపే అంశం. ఈ నియోజకవర్గం అభివృధి విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి జితేంద్రగౌడ్ నాయకత్వము నుంచి అసమ్మతి సెగలు తగులుతున్నాయి.


ప్రజలను, నియోజకవర్గాన్ని సరిగా పట్టించుకోవట్లేదని, అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి అని అక్కడి ప్రజలు వాపోతున్నారు. నీటి సమస్య ఇక్కడ ప్రధానంగా మారి, ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ నేత వెంకటరామిరెడ్డి ప్రజలలో నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అయితే మరి 2019 లో ఎన్నికల్లో గుంతకల్ ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: