తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఇద్ద‌రు తెలుగు హీరోయిన్ల‌ను రంగంలోకి దింపుతోంది. టాలీవుడ్ హీరోయిన్ మాధ‌వీల‌తకు బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకు టికెట్ కేటాయించింది. ఇక మ‌రో హీరోయిన్ రేష్మాను పార్ల‌మెంట్ బ‌రిలోకి దింపేందుకు బీజేపీ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.   
 Image result for madhavilatha bjp
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నుంచి బ‌రిలోకి దిగిన మాధవీలత.. 'నచ్చావులే' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రవిబాబు దర్మకత్వం వహించిన ఈ సినిమాను రామోజీరావు నిర్మించారు. ఆ సినిమా ద్వారా మాధవీలత మంచి పేరు తెచ్చుకుంది.  అయితే అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఆ తర్వాత నాని హీరోగా స్నేహితుడా.. సినిమాలో నటించింది మాధవీలత. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన.. సరైన గుర్తింపు రాలేదు. ఆ మధ్య మీటూ ఉద్యమంలో కూడా తన గళాన్ని వినిపించింది. అంతేకాకుండా.. ఆమె.. కొన్నాళ్లుగా బీజేపీ తరఫున గళం వినిపించింది. దీంతో పార్టీ.. మాధవీలతకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. మాధవీలత అసలు పేరు పసుపులేటి మాధవి. ఆమె కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు కుటుంబానికి చెందిన ఆమె, అక్కడే చ‌దువుకుంది. 
 Related image
ఇక మ‌రో హీరోయిన్ రేష్మారాథోడ్ ఈ రోజుల్లో సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. మ‌రికొన్ని సినిమాల్లో న‌టించింది. అయితే పెద్ద అవ‌కాశాలేవి రాలేదు. కొంత‌కాల‌నికే రాజ‌కీయాల‌పై ఆస‌క్తి పెంచుకున్న రేష్మా.. బీజేపీలో చేరారు. ఆ పార్టీ  బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగాను ప‌ద‌వి అందుకుంది. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైరా నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుపున పోటీ చేసి ఓట‌మిపాల‌యింది. తాజాగా బీజేపీ త‌రుపున‌ అదిలాబాద్ పార్ల‌మెంట్ బ‌రిలోకి దిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మొత్తానికి బీజేపీ ఇద్ద‌రు యంగ్ హీరోయిన్ల‌ను పొలిటిక‌ల్ బ‌రిలోకి దింపుతోంది. మ‌రి సినీ గ్లామ‌ర్ ఈ సారి ఎంత‌వ‌ర‌కు ప‌ని చేస్తుంద‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్.


మరింత సమాచారం తెలుసుకోండి: