జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉత్కంఠ‌కు తెర‌దించారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి బ‌రిలో దిగ‌బోయేది వెల్ల‌డించారు. రెండు స్థానాల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌నున్న‌ట్లు జ‌న‌సేన తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. అయితే, ప‌వ‌న్ రెండు చోట్ల పోటీ ఎందుకు చేయ‌నున్నార‌నేది మాత్రం క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం,విశాఖజిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా పార్టీ జనరల్ బాడీ ఆయనను కోరింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకోవడానికి జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపించింది. అనంతపురం,తిరుపతి,రాజానగరం, పిఠాపురం,భీమవరం,గాజువాక,పెందుర్తి,ఇచ్చాపురం స్థానాలు అగ్రస్థానంలో నిలిచాయి.


ఈ ఎనిమిది స్థానాలపై అంతర్గత సర్వే జరిపించిన జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు భీమవరం,గాజువాక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్‌ని కోరారు. దీనికి ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీచేయాలని నిశ్చయించుకున్నారు. నామినేషన్ ఏ రోజున దాఖలు చేయనున్నది ఈ రోజు సాయంత్రం లేదా రేపు తెలియ చేస్తారు. అని జ‌న‌సేన ప్ర‌క‌టించింది. 


అయితే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయ‌డం వెనుక పార్టీ ఏం లెక్క‌వేసింది? ఎందుకు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌నే ఎంచుకున్నారు? అనేది పార్టీ విపులంగా తెలియ‌జేయ‌క‌పోవ‌డం కొస‌మెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: