దక్షిణ కాశీగా పేరుగాంచిన వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తిలో తాజా రాజకీయాలు హీటెక్కుతున్నయి. టీడీపీ, వైసీపీ, జనసేన లాంటి ప్రధాన పార్టీలు సత్తచాటెందుకు సిద్దంగా ఉన్నాయి. వాటితో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ, నూతన రాజకీయ పక్షాలు సైతం పోటీ సై అంటున్నాయి. 1952 లో ఏర్పడిన శ్రీకాళహస్తి నియోజకవర్గం 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. వాటిలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయ ఢంకా మోగించింది. టీడీపీ 7 పర్యాయాలు శ్రీకాళహస్తిలో సత్తాచాటాయి. స్వతంత్ర్య అభయర్థులు రెండుసార్లు సత్తచాటరు. ఒకప్పుడు శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. దివంగత నేత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేశారు. 1967 నాటికి కాంగ్రెస్ హవా సన్నగిల్లింది. మాజమంత్రి, ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ తండ్రి బొజ్జల గంగు సుబ్బరామిరెడ్డి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు రుచిచూసారు. 1989, 1994, 1999 లో బొజ్జల గోపాలకృష్ణరెడ్డి వరుసుగా హ్యాట్రిక్ సాధించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ హవా బొజ్జల విజయానికి బ్రేక్ వేసింది. కాంగ్రెసు అభ్యర్థి ఎస్సీవి నాయుడు, బొజ్జల పై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2009, 2014 లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మళ్లీ తన ఆధిపత్యాన్ని నిరూపించారు. బొజ్జల హయాంలో అభివృధి మాత్రం పడకేసింది. ఇప్పటికీ ఇరుకు రోడ్డులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నీటి పారిశుధ్యం మరీ అధ్వానంగా తయారైంది. కానీ ఈసారి టీడీపీ పార్టీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఇటు వైపు వైసీపీ నుంచి బియ్యపు మధుసూధన్ రెడ్డి బరిలో దిగుతున్నారు. జనసేన పార్టీ తరపున అభ్యర్తిని ఇంకా ఖరారు చేయలేదు. శ్రీకాళహస్తి ఓటర్ల అనుగ్రహం ఎవరిపై ఉంటుందో మరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: