అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అన్ని ప్రధాన పార్టీలలోను ఉంది. అందుకు నిదర్శనంగా దశాబ్దాల ఫలితాలను పార్టీలు, నాయకులు చూపుతున్నారు. తాజాగా టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలుగా పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలుపును రెండు పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. అందుకే ఇరు పార్టీలు ఇక్కడి గెలుపు కోసం వ్యుహాలకు పదును పెడతారు. గత ఎన్నకల్లో వైసీపీ అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి, టీడీపీ అభ్యర్థిగా యామిని బాల పోటీపడ్డారు.
 

టీడీపీకి చెందిన యామిని బాల 4,583 ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్ధి పద్మావతి పై గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ రీపీట్ అయ్యింది. 2004, 2009 లో డా. శైలేజనాథ్ కాంగ్రెస్ తరుపున గెలిచారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. శైలేజనాథ్ కు ఏకంగా మంత్రి పదవులు దక్కాయి. 1985, 1994, 1999 శింగనమలలో సైకిలే సవారీ చేసింది. స్టేట్ లోనూ అదే అధికారంలోకి వచ్చింది. శింగనమలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం అనే సెంటిమెంట్ బలపడింది.

ఇప్పటికే వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి నీ ఖరారు చేశారు. అటునుంచి టీడీపీ పార్టీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలను తప్పించి బండారు శ్రావణి కి అవకాశం ఇచ్చారు. మొత్తానికి శింగనమల ను కైవసం చేసుకోనీ రాష్ట్ర అధికార పీఠాన్ని చేజిచ్చుకోవలని వైసీపీ, టీడీపీ పావులు కదుపుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఇక్కడి గెలుపు రాష్ట్రంలో అధికారం తెచ్చిపెడుతుందా ? దశబ్దాలుగా ఉన్న సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా ? మరి కొన్ని రోజులకు గాను ఈ ఉత్కంఠకు తెర పడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: