ఏపీలో బయటకు కనిపిస్తున్న సీన్ వేరు. లోపల జరుగుతున్న కధ వేరు. రాజకీయంగా కొత్త ఎత్తుగడలతో అధినేతలు పావులు కదుపుతున్నారు చిత్రమేంటంటే ఆ ఎత్తులన్నీ ఇపుడు అందరికీ తెలిసిపోతున్నాయి. ఇదివరకు మాదిరిగా జనాన్ని ఏమార్చడం కష్టమైన రోజులివి. ఏపీలో జనసేన, టీడీపీ
ఈ రెండు పార్టీలో మాత్రం అభర్ధుల  కధ ఓ కొలిక్కి రావడంలేదు. దీని భావమేనిటి అంటే లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని సమాధానం వస్తోంది.


ఈ రెండు పార్టీలు బయటకు వేరుగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక్కటిగా ఉంటున్నాయని అంటున్నారు. వైసీపీ అభ్యర్ధుల లిస్ట్ బయటకు వచ్చింది. దాంతో ఆ అభ్యర్ధుల ఓట్లు చీల్చడానికి అదే కులానికి చెందిన వారిని ఏరి కోరి మరీ జనసేన‌ ఎంపిక చేస్తోందంటే దీని వెనకాల రాజకీయం ఎవరూ వూహించకుండా ఉండలేరు. శ్రీకాకుళంలో వెలమ వర్గం నుంచి టీడీపీ తరఫున రామ్మోహనాయుడు ఉంటే అక్కడ కాళింగ కులానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కి వైసీపీ టికెట్ ఇచ్చింది. అదే కాళింగ  సామాజిక వర్గానికి చెందిన మెట్టా రామారావుకు జనసేన టికెట్ ఇవ్వడం డౌట్లు పుట్టిస్తోంది. అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు ఓట్లు చీలిపోతే అక్కడ టీడీపీ గెలుపు ఖాయం చేయడానికి జనసేన ఎంపిక ఉందని అంటున్నారు.


అలాగే పెందుర్తి విషయం తీసుకుంటే అక్కడ కూడా వెలమ సామాజిక వర్గం, కాపులు బలంగా ఉన్నారు. జనసేన న ఏరి కోరి బలమైన కాపు నేతను అక్కడ బరిలో ఉంచింది. ఆయన ప్రజారాజ్యం మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య. ఇక్కడ టీడీపీ అభ్యర్ధి వెలమ. ఈ ఇద్దరి పోరుల జనసేన అభ్యర్ధి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలా జనసేనకు టీడీపీ ప్రత్యుపకారం  చేస్తుందనుకోవాలి. ఆయన భారీగా చీల్చే ఓట్లతో ఇక్కడ వైసీపీ విజయావకాశాలు గండికొట్టాలని ప్లాన్ గా ఉంది. 

అనకాపల్లిలో సీటు కూడా అలాగే బలమైన నేతకు జనసేన ఇచ్చింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీ తరఫున గుడివాడ అమర్నార్ధ్ పోటీలో  ఉన్నారు. ఆయన్ని ఓడించాలని జనసేన ప్లాన్ గా ఉంది. అది చివరికి  టీడీపీకి లాభించేలా వ్యూహం కనబడుతోంది. ఇలాంటి చిత్రాలు ఈ ఎన్నికల్లో ఎన్నో కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: