పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ కలిగిన సినిమా హీరో. యూత్ లో క్రేజ్ ఉన్న స్టార్. ఆయనకు సామాజిక వర్గం బలం కూడా ఉంది. మూడవ పక్షంగా ఏపీలో రాజకీయాన్ని మారుస్తామంటూ జనంలోకి వచ్చిన సేనాని వైఖరి ఇపుడు కాస్త తేడాగా ఉంటోందంటున్నారు. ఆయన మాటలకూ చేతలకూ పొంతన లేదని కూడా సెటైర్లు పడుతున్నాయి.


పవన్ ఈ రోజు విడుదల చేసిన జాబితాలో విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీట్ల నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. పవన్ వంటి చరిస్మా ఉన్న నాయకుడు రెండు సీట్లు ఎంచుకుని పోటీ చేయడం ఏంటన్న ప్రశ్న వెంటనే వచ్చేస్తోంది. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కూడా రెండు సీట్లలో పోటీ చేశారు. అయితే చిరంజీవి పోటీకి ఓ కారణం ఉంది కోస్తాలో ఓ సీటు, రాయలసీమలో మరో సీటు అని పెట్టుకుని చేశారు. మరి తమ్ముడు పవన్ మాత్రం విశాఖతో పాటు, పక్కనే ఉన్న గోదావరి జిల్లాల్లోనే పోటీ చేయడమేంటన్న మాట వస్తోంది. ఇందులో లాజిక్ కనిపించడం లేదని అంటున్నారు.


పవన్ వంటి నాయకుడే రెండు సీట్లలో పోటీ చేస్తే ఇక మిగిలిన వారి సంగతేంటి. నాయకుడు అన్న వాడు తాను అదురు బెదురు లేకుండా ముందుకు పోవాలి కదా. పవన్ భాషలోనే చెప్పాలంటే ముందుకు ఒకసారి అడుగు వేశామంటే తల తెగిపడినా వెనక్కు చూడకూడదు కదా. మరి. పవన్ కి ఎందుకు ఈ రెండింటి సీట్ల పోటీ అని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఎక్కడైన తేడా కొడుతుందేమోనన్న కలవరమే పవన్ని ఇలా రెండు సీట్లకు పోటీ పెట్టింది అంటున్నారు. బాగానే ఉంది కానీ రెండు సీట్లు పవన్ గెలిస్తే ఒకదాంట్లో ఉప ఎన్నికలు జరిగితే ఆ ప్రజాధనానికి ఎవరి ఖర్చు రాస్తారో కూడా పవనే చెప్పాలని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: