రాయలసీమకు నీటిని అందించే గేట్ వే గా కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పిలవబడుతుంది. ప్రకృతి అందాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవు ఈ ప్రాంతం. కృష్ణ, తుంగభద్ర నది పరవళ్ళతో సమృద్దిగా నీటి లభ్యత ఉన్న ప్రాంతం. ఫ్యాక్షన్ రాజకీయాలు మరియు ఇక్కడి నాయకుల ఆధిపత్య పోరు మధ్య నందికొట్కూరు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. 2014 లో వైసీపీ నుంచి ఐజయ్య, తన ప్రత్యర్థి అయిన వెంకట స్వామి పై 21 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


1952 లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత రెడ్డి సామాజికవర్గానికి చెందిన అనేకమంది తమ రాజకీయ ప్రస్థానం సాగించారు. బైరెడ్డి శేష సైనా రెడ్డి, మద్దూరు సుబ్బా రెడ్డి వంటి వారు మకుటం లేని మహారాజులుగా వర్దిల్లారు. అనంతరం వారి రాజకీయ వారసులుగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డి నందికట్కూరు రాజకీయాలను శాసించారు. అయితే 2009 లో ఎస్సీ రిజర్వ్ అయ్యాక నందికొట్కూరు తొలి దళిత ఎమ్మెల్యేగా లబ్బి వెంకటస్వామి గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఐజయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.


గత కొంతకాలంగా గౌరు, బైరెడ్డి ల వర్గాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇది ఎస్సీ రిజర్వ్ అయిన ఇక్కడ వీరిదే హవా. ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలన్న వీరి ఆశీస్సులు ఉండాల్సిందే. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే విపక్ష నేత అవ్వడంతో నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి బరిలో టీడీపీ నుంచి బండి జయరాజు దిగుతున్నారు. అటు వైసీపీ నుంచి ఐజయ్య పోటీ చేస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే అన్నపురెడ్డి బాల వెంకట్ పోటీ చేయబోతున్నారు. ఇక్కడ అన్ని పార్టీల నుంచి గెలుపు కోసం పోటీ తారాస్థాయికి చేరింది. అయితే ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టపెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: