చంద్రబాబును అందరూ హైటెక్ సీఎం అని అంటారు. ఎందుకంటే బాబు ఉపయోగించిన విధంగా టెక్నాలజీ ఏ సీఎం ఉపయోగించకపోవటం. తాజాగా ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల మీద డ్రోన్ అస్త్రాలను సంధిస్తున్నారు. వారిని అడుగడుగునా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పర్వం నువ్వానేనా అన్నట్లుగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Image result for chandrababu

పలు సర్వేలలో వైఎస్సార్ సీపీకి ప్రజాబలం అనుకూలంగా ఉన్నట్లు వాదనలు వినిపిస్తుండడంతో... ఆ ప్రజాబలానికి చెక్ పెట్టే ప్రయత్నాలకు చంద్రబాబు కోటరీ ఒడిగడుతున్నట్లుగా కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఉన్నచోట వారి కదలికలు ఎలా ఉంటున్నాయో... ఎవరెవరు వచ్చి కలిసి వెళుతున్నారో... తదితర వివరాలు అన్నీ సేకరించేందుకు... డ్రోన్లతో నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ కార్యాలయాల మీద డ్రోన్ల నిఘా సాగుతున్నట్లుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Image result for chandrababu

గుంటూరులో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కార్యాలయం మీద కూడా డ్రోన్ల నిఘా సాగుతోందని అంటున్నారు. అయితే ఈ డ్రోన్లు పోలీసుశాఖ వారివా? లేదా, తెలుగుదేశం పార్టీ తైనాతీలవా? అనే సమాచారం మాత్రం తెలియడం లేదు. సాధారణంగా డ్రోన్లను వినియోగించాలంటే... ప్రెవేటు వ్యక్తులు అయినా సరే.. ముందస్తుగా పోలీసు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అయిన వారికి ఇలాంటి వాటి అనుమతులు అవసరం ఉండదనిపించేలా... డ్రోన్లు ఎడాపెడా వైకాపా మీద నిఘా పెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: