రాజకీయాలు కక్షపూరితమైన వేళ, ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ ఎన్నికలనే ప్రహససం నడుస్తోంది. డెబ్బయ్యేళ్ల స్వాతంత్ర భారతావనిలో ఎన్నికలు అంటే తాయిలాలు, ఆ రొజుకు ఓటున్న వాడి చేతికి కొంత సొమ్ము అందడం అన్న విధానంగా మారింది. ప్రజాగ్రహాన్ని ఎలా చల్లార్చాలో తెలిసిన నేతలు పాలకులుగా ఉన్న రోజులివి.


ఇదిలా ఉండగా, చంద్రబాబు మీద ఒకనాటి ఆయన సహచరుడు,  మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన  కామెంట్స్ చేశారు. ఏపీలో పొరపాటున చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం  జగన్ని బతికి ఉంచడంటూ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. జగన్ బాబుకు ఎదురు నిలిచి బలమైన నేతగా ఉండడమే ఇందుకు కారణమని కూడా ఆయన విశ్లేషించారు. అంతే కాదు అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారని కూడా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అనడం విశేషం.


గతంలో ఎన్.టి.ఆర్.కు వెన్ను పోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన చంద్రబాబు ఓడిపోవడం ద్వారా ఎన్.టి.ఆర్ ఆశయం నెరవేరుతుందని ఆయన అన్నారు. తాను టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని చెప్పినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. ఇక ఎపీలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ఓట్లు కొంటున్నారని, అదంతా ప్రజల సొమ్మేనని ఆయన అన్నారు. బాబుకు ఈసారి ఎన్ని ఓటమి ఖాయ‌మని కూడా ఆయన చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: