విశాఖ రాజకీయాలు చిత్రంగా ఉన్నాయి. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు అయ్యారు. సిధ్ధాంతపరంగా కాదు, రాజకీయంగానే విభేదించుకుంటున్నారు. అనుకోకుండా మిత్రుడే ప్రత్యర్ధి కావడం ఇక్కడ రాజకీయ విశేషం. 


విశాఖ ఉత్తరం సీటు ఇపుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న మంత్రి గంటా శ్రీనివారావుకు ఎలక్షనీరింగ్ బాగా తెలుసు. ఆయన నాలుగు ఎన్నికలను చూసిన అనుభవశాలి. ప్రతీ సారీ సీటు మార్చినా ఓటమి ఎరగని నేత. అటువంటి గంటా ఇపుడు ఉత్తరం మీద పడ్డారు. దాంతో ఆ సీటుని నమ్ముకున్న బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా మిత్రుడు విష్ణుకుమార్ రాజు గారు తెగ హైరానా పడుతున్నారు. గంటా కనుక పోటీ చేయకపోతే ఆ సీటులో ఆయన‌దే గెలుపు అన్నట్లుగా సీన్ ఉండేది. అదిపుడు తారుమారు అవుతోందని ఆయన కంగారు పడుతున్నారు.


దాంతో ఆయన తాను ఈ ఎన్నికల్లో అవినీతి అనకొండ గంటాను ఇంటికి పంపిస్తానని గట్టిగా చెబుతున్నారు. తాను అయిదేళ్ళ పాటు నిజాయతీగా ప్రజాలకు సేవ చేశానని చెబుతున్నారు. అందువల్ల ఈ ఎన్నికలు నీతికి, నిజాయాతీకి మధ్యన పోటీ అని ఆయన క్లారిటీగా చెప్పేస్తున్నరు. గంటా అవినీతి డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్నారని, అయితే తన నియోజకవర్గం ప్రజలు అమ్ముడుపోరని ధీమాగా చెబుతున్నారు. కాగా ఇక్కడ రాజులతో పాటు, వెలమలు, కాపులు, బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి గంటా వంటి ఉద్దండుడు పోటీకి  దిగాడు కాబట్టి పరిస్తితిని మొత్తం ఆయన అనుకూలంగా చేసుకుంటారని వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: