Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 9:14 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప

ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత,  నారా చంద్రబాబు నాయుడు తన 'అసహన' రాజకీయాలతో తెలుగువారికే కాదు ఇరుగు పొరుగు వారికి కూడా విసుగు తెప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు ఎక్కడికి వెళ్ళినా ఒకటే తంతు. ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిన ప్రయోజనాలేమిటో చెప్పాల్సింది పోయి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని విమర్శించటం పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి ని విమర్శించడం, ఎక్కడో బీహార్‌ లో రాజకీయాలు చేసుకుంటోన్న, వైసిపి ఎన్నికల వ్యూహకర్త ఒక కన్సల్టెంట్ -  ప్రశాంత్‌ కిషోర్‌ ని, ఆయన పుట్టిన బీహార్ రాష్ట్రాన్ని దూషించడం, అదే ఒక ఎన్నికల ప్రచార ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. 
ap-news-telangana-news-depression---hopelessness-i
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి మీద చంద్రబాబు విమర్శలకు ఒక దశాబ్ధకాలం చరిత్ర ఉంది. కొత్తగా ఆయన జగన్‌మోహన రెడ్డి  మీద చేయడానికి ఎలాంటి విమర్శలు లేవు కాబట్టి, కొత్త కొత్త అంశాల్ని తెర పైకి తెస్తున్నారు. ఇటీవల హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో జనానికి మతిపోగొడు తున్నారు. 'వాళ్ళే చంపేసి, వాళ్ళే ప్రభుత్వానికి ఆ హత్యను అంటగడుతున్నారు!' అన్నట్లుగా చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలతో జనం షాకై పోతున్నారు. నిజంగా అదే జరిగితే దాన్ని చట్టబద్ధంగా ఋజువు చెసే అధికారం ఒక ముఖ్యమంత్రిగా ఉంది కదా! బాధ్యత నెరవేర్చకుండా ఆరోపణలు చేస్తుండటంతో తటస్తులు సైతం ఆగ్రహోద్రగ్ధులౌతున్నారు. వారి సహనానికి సైతం ఒక హద్దు ఉంటుంది కదా! 
ap-news-telangana-news-depression---hopelessness-i
ఇక, ప్రశాంత్‌ కిషోర్‌ విషయంలో అయితే చంద్రబాబు దూకుడు మరీ దారుణంగా తయారైంది. 'డెకాయిట్‌' అంటూ పదే పదే ప్రశాంత్‌ కిషోర్‌ ని విమర్శిస్తున్న  వైసిపికి గతం లో ప్రశాంత్‌ కిషోర్‌ “వ్యూహకర్త & సలహాదారు” గా ఉన్న వాస్తవం అందరికి తెలిసిందే. అది వైసిపి అంతర్గత వ్యవహారం. అక్కడికే ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో ఓట్ల తొల గింపు జరిగి పోయిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇంకో పక్క రాష్ట్ర ఎన్నికల అధికారి అసలు ఓట్లు తొలగించ బడలేదని కుండబ్రద్ధలు .కొట్టినట్లు చెపుతున్నారు. 
అయినా అలాంటి భయంకర నేఱం జరుగుతూ ఉంటే ప్రభుత్వాధినేతగా చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆ నేఱాన్ని చట్టబద్ధంగా నిరోధించకుండా ప్రజలముందు మొత్తు కునే, ముఖ్యమంత్రి ఏపి ప్రజలకు అవసరమా? ఫ్రజలు అధికారం ఇచ్చింది తమ వద్దకు వచ్చి ముఖ్యమంత్రి నెత్తి నోరు బాదుకోవటానికి కాదు కదా! 
ap-news-telangana-news-depression---hopelessness-i
మొత్తంమ్మీద, జరిగిన అనేక సర్వేల్లో ఒక్క సర్వే కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పలితాలు ఇవ్వకపోవటం చంద్రబాబు ఏదో ఒక ఒక రకమైన నిరాశాంధకారం మనసంతా అలుముకోగా ఏదో ఒక అంశం పట్టుకుని జనం ఆలోచనల దారితప్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కన్పిస్తోంది.  నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకుందని పదే పదే చెప్పుకునే చంద్రబాబు, “హుందాతనం గురించి ఎప్పటికప్పుడు క్లాసులు పీకే చంద్రబాబుఇలా అసహన రాజకీయాలతో తన హుందాతనం కోల్పోతూ క్రమంగా లేకితనంతో ఊగిపోతుండడం అత్యంత హాస్యాస్పదం అవుతూ రావటం, చివరకు తన వ్యవహార శైలే తనను నిట్టనిలువు న ఓడించనుందని తెలుగుదేశం కార్యకర్తలే చెపుతున్నారు. చంద్రబాబులో హద్దులు దాటిన అసహనం-నిరాశ-నిస్పృహలే ఆయన్ని ఓడిస్తాయని ఘంటా పధంగా చెపుతున్నారు
ap-news-telangana-news-depression---hopelessness-i
ప్రత్యేక హోదా అంశం అటకెక్కింది. 

రాజధాని అమరావతి ఊసేలేదు. 

పోలవరం ప్రగతి గురించిన ప్రస్తావనే రావటం లేదు
ap-news-telangana-news-depression---hopelessness-i
వీటన్నిటినీ మించి ఇతర అంశాల మీదనే చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా ఆధార పడినట్లున్నారు. అందుకే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించీ, ప్రశాంత్‌ కిషోర్‌ "ఒక బిహార్ బందిపోటు" అంటూ దాని గురించీ, కేసీఆర్‌ రిటన్-గిఫ్ట్‌ గురించీ గుండెలవిసేలా ఘోష పెట్టటం జరుగుతూవస్తుంది. 
ap-news-telangana-news-depression---hopelessness-i
‘ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై మాకెలాంటి ఆసక్తి లేదు' అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించిన తరవాత కూడా చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ కెసీఆర్ చేస్తున్నారంటే ఆయన గుండెల్లో అలుముకున్న నిరాశ నిస్పృహలు ఆ స్థాయిలో ఉప్పొంగుతున్నట్లేనంటున్నారు జనాలు. ఇంత ఆత్మన్యూనత అలుముకున్న మనసుతో చేసే ఆయన ప్రచారం అత్యంత నిమ్నస్థాయికి పడిపోగా జనాలకు ఇంత ఆత్మవిశ్వాసం లేనివారు ముఖ్యమంత్రిగా పనికి రారనే అంటూ చంద్రబాబు అధికారానికి ఈ ఎన్నిక్లలో తిలోదకాలివ్వటానికే నిశ్చయించుకున్నట్లు ప్రస్పుటంగా కనిపిస్తుంది. 
ap-news-telangana-news-depression---hopelessness-i
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుపై జగన్ తొలి అస్త్రం ఏమిటో తెలుసా? తెలుసుకోండి!
తెదేపా పతనానికి నాడే పడ్డ పునాదులు - ఇక జగన్ జనం నమ్మకం నిలుపుతారనే నమ్ముదాం!
టిడిపి కుటుంబ ప్యాకేజీలకు వారసులకు వైసిపి సునామిదెబ్బ
జగన్ ప్రభుత్వం: సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం - సలహాదారుగా అజయ్ కల్లాం
నందమూరి కుటుంబానికి ఇంకొంత గౌరవం ఉన్నట్లే ఉంది-నారా కుటుంబం తుడిచిపెట్టుకు పోయింది
అవినీతి అక్రమాలే చంద్రబాబును టిడిపిని నిట్టనిలువుగా ముంచేశాయి
తాజెడ్డ కోతి వనమెల్ల చెరచు అన్నట్లు బాబు తనతో పాటు కాంగ్రెస్ నూ చెరిచారు!
కర్ణాటకలో దెవెగౌడ ఖేల్ ఖతం: రాజకీయాల నుండి గెంటేశారా!
కౌగిలించుకొని కాంగ్రెస్ కొంప ముంచాడు నవజ్యోత్ సింగ్ సిద్దు! కెప్టెన్ అమరిందర్ సింగ్
బ్రేకింగ్ న్యూస్ : రాహుల్ గాంధిని ఆల్ టైమ్ రికార్డుతో గెలిపించిన దక్షిణాది - ఉత్తరాది తన్నేసిందా!
కేసీఆర్! రాష్ట్ర పాలన సరిగా చూడు! దేశం సంగతి మేం చూసుకుంటాం! తెలంగాణా జనం
మట్టిలో మాణిక్యం టీఅరెస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు!  బామ్మర్ధి కేటీఆర్ ఖేల్ ఖతం!
ఏపిలో వైసీపికి లాండ్ స్లైడ్ విజయం-దేశమంతా బీజేపి నిశ్శబ్ధ విప్లవం-చంద్రబాబుకు చరమగీతం
వారసుల గోల ఎక్జిట్-పోల్స్ లీల! ముఖ్యమంత్రుల తనయులు కర్ణాటక - ఏపిలో ఓడిపోవడం గ్యారెంటీ!
అబద్ధం (అసత్యం) చెప్పవచ్చట – ఆ సందర్భాలు ఏవంటే!
“ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?”  కాంగ్రెసోళ్ళు ఇంతకు తెగించారు!
చంద్రబాబుకు షాక్: రేపటితో కర్ణాటకంలో కుమార ప్రభుత్వం పతనమేనా?
 "ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!
తెలుగుదేశం ఒకవేళ మే 23 న ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే? చంద్రబాబు చెప్పనున్న కారణాలు
About the author