ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మ‌ళ్లీ న‌వ్వుల‌పాల‌య్యే వ్యాఖ్య‌లు చేశారు. అస‌లేమాత్రం వాస్త‌వం లేని వ్యాఖ్యలు చేయ‌డం ద్వారా టీడీపీ యువ‌రాజ వారు జ‌నం దృష్టిని మ‌ళ్లీ త‌న‌వైపు తిప్పుకొన్నారు. మంగళగిరిలోని రూరల్‌ మండలం నవులూరు, బేతంపూడి, నీరుకొండ, కూరగల్లు, నిడమర్రు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి లోకేష్‌ సమక్షంలో మాట్లాడుతూ, తనకు ఒక్క అవ కాశం ఇస్తే భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 


మంగ‌ళ‌గిరిలో ప్రముఖ విద్యాసంస్థలైన ఎస్సారెమ్‌, విట్‌ వచ్చిందని, సచివాలయం అభివృద్ధి జరుగుతుందని, ఐటీ పరిశ్రమలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రాంతంలో రాజధాని రాకూడదని ప్రతిపక్ష పార్టీ విశ్వప్రయత్నం చేశారని, పొరపాటున ప్రభుత్వం మారిపోతే రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోతాయని   బెదిరింపు వ్యాఖ్య‌లు చేశారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబితే ఒకటే మాట చెప్పారని, చంద్రగిరి అవసరం లేదు, మన పక్కనే మంగళగిరి ఉంది, అక్కడ పోటీచేయ్‌, ప్రజలతో మమేకం అవ్వు, ప్రజల అభిమానం పెంచుకున్న తర్వాతే శాసనసభలో అడుగుపెట్టు అని సూచించారన్నారు. ఒకవేళ వైసీపీ గెలిస్తే..ప్రతిపక్ష హోదాలో లోకేష్ నాయుడు అసెంబ్లీలో అడుగుపెడితే..ఎలా నిలబలగలడు..ప్రత్యర్థుల దాడిని ఎలా ధీటుగా ఎదుర్కొనగలడు అన్న సందేహాలు ఏపి ప్రజల్లోనెలకొంటున్నాయి. 


అందుకే మీరందరీ ఆశీర్వాదం కావాలని, మంచి మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయని, రెండూ సైకిల్‌ గుర్తుకే వేయాలని విజ్ఞప్తిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: