ఇపుడిదే ప్రశ్న మేధావులను వేధిస్తోంది. ఎన్నికలంటేనే కోట్ల రూపాయల ఖర్చన్న విషయం ఇపుడు మామూలైపోయింది. ఇందుకు ఏ పార్టీ కూడా అతీతంకాదు. ఎందుకంటే, ఒకపార్టీ ఖర్చు పెడుతోందని మరోపార్టీ ఇలా ఎన్నికల ఖర్చులను వేల రూపాయల నుండి లక్షలకు పెంచి ఇపుడు కోట్ల రూపాయలదాకా తీసుకెళ్ళారు. నిజానికి ఏపిలో ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయలకు చేరిందంటే అందుకు చంద్రబాబునాయుడే పుణ్యం కట్టుకున్నాడని చెప్పాల్సిందే.

 Related image

ఎన్టీయార్ బ్రతికున్నంత కాలం అంటే 1994 దాకా ఎన్నికల ఖర్చులు పెద్దగా లేదనే చెప్పాలి.  ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి సిఎంగా చంద్రబాబు దింపేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వెన్నుపోటు ఉదంతాన్ని జనాలు మరచిపోయేట్లుగా బడా పారిశ్రామికవేత్తలను ఎన్నికల్లోకి దింపారు. వాళ్ళు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి తనలోని మైనస్ లన్నీ పక్కనపెట్టేట్లుగా చేసిన ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అప్పటి నుండి ఎన్నికల్లో డబ్బుదే ప్రధాన పాత్ర అయిపోయింది. ఓటుకు నోటు కేసు ఇందులో భాగమే.

 Related image

ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బు పాత్ర కీలకమైందో అప్పటి నుండే రాజకీయ నేతలను  పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు డామినేట్ చేయటం మొదలైంది. ఇపుడు పార్టీలు ప్రకటిస్తున్న అభ్యర్ధుల జాబితా ఆ విషయం స్పష్టమవుతుంది. డబ్బులున్నాయి కాబట్టి ఓటర్లకు ఒకరికి మించి మరొకరు వేల రూపాయలు ఇచ్చి ఓట్లేయించుకుంటున్నారు. గంతగుత్తగా లక్షల రూపాయలు పెట్టి ఓట్లను కొనేస్తున్నారు.

 Image result for balakrishna cash distribution

నిజానికి ఎంతో విలువైన ఓటును ఓ వెయ్యి రూపాయలకో లేకపోతే 5 వేల రూపాయలకో అమ్ముకోవటం చాలా తప్పు. కానీ ఓటర్లలోని వీక్ నెస్ పై అభ్యర్ధులు దెబ్బకొడుతున్నారు. అందుకే ఓటర్లు కూడా తమ ఓట్లను అమ్మేసుకుంటున్నారు. అందుకనే ఓట్లు కొనుగోలు చేసి గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఓటర్లకు అందుబాటులో ఉండటం లేదు. ఒకసారి తమ ఓటును అమ్ముకున్న తర్వాత ప్రజాప్రతినిధిని అభివృద్ధి గురించి అడిగే నైతిక హక్కును ఒటర్లు  కోల్పోతున్నారు.

 Image result for cash seizing elections

పోయిన ఎన్నికల్లో కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి ఖర్చు సుమారు 100 కోట్ల రూపాయలు దాటిందని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన రాబోయే ఎన్నికల్లో ఖర్చులు ఎంతుంటాయో ఎవరికి వారుగా అంచనా వేసుకోవచ్చు.  డబ్బులిస్తున్నారు కాబట్టే తీసుకుంటామని ఓటర్లంటున్నారు. ఓటర్లు తీసుకుంటున్నారు కాబట్టే డబ్బులిస్తున్నామని అభ్యర్ధులంటున్నారు. సరే డబ్బులు ఎవరిస్తున్నారు ? ఎవరు తీసుకుంటున్నారు ? అనే చర్చ అనవసరం. ఓటర్లు గనుక డబ్బులు తీసుకోవటం మానేసినపుడే  సమాజం బాగుపడుదనటంలో సందేహం లేదు. కాబట్టి ముందు ఓటరే చొరవ తీసుకుంటే బాగుంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: