బెల్లం ఎక్కడ ఉంటే..ఈగలు అక్కడ అన్న చందంగా..అధికారం ఎక్కడ ఉంటే నాయకులు అక్కడికే అన్న తీరులో ఉంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి.  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి గెలిచిన వారు..ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వలసబాట పట్టారు.  సీనియర్ నాయకులే వెళ్తున్న క్రమమంలో మా పరిస్థితి ఏంటీ అన్న కోణంలో ఒక్కొక్కరూ కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ బాట పట్టారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బుధవారం నాడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

ఉదయం ప్రగతి భవన్‌లో కొల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నాలుగు గంటలుగా చర్చలు జరుపుతున్నారు. గత కొన్ని రోజులుగు హర్షవర్ధన్ రెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరనున్నారని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఉదయం ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌తో భేటీ కావడంపై ఆయన కారు ఎక్కుతున్నట్లుగా కన్ఫామ్ అంటున్నారు. 

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వర రావు, సుధీర్ రెడ్డి,  కందాళ ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై విజయం సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: