దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ఆసక్తి కలిగిస్తున్న మరో రాష్ట్రం ఒడిశా. 19 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఈసారి కూడా అధికారం చేపట్టేందుకు తీవ్ర కసరత్తే చేస్తున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యూహత్మంగా ఒడిశా రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఇప్పడు ఐదోసారి ఒడిశా సీఎంగా అయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

Image result for naveen patnaik bjd

ఒడిశాల్లో 19 ఏళ్ల నుంచి బీజూ జనతాదళ్ అధికారమే కొనసాగుతుండంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వాటిని ఏదోలా అందిపుచ్చుకోవాలని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తన ఉనికి కోసం పాకులాడే పరిస్థితికి దిగజారింది. ఒకప్పుడు నవీన్ పట్నాయక్ తో ఢీ అంటే ఢీ అన్న కాంగ్రెస్ పార్టీ.. గడిచిన 19 ఏళ్లలో బాగా బలహీనపడింది.. ఈ ఎన్నికల్లో ఏదోలా బీజూ జనతాదళ్ తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలే చేసింది. కానీ నవీన్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు సరికదా.. తాము  కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరంలో ఉంటామని ప్రకటించేశారు. దీంతో అక్కడ పొత్తులకు మార్గం మూసుకుపోయింది.

Image result for naveen patnaik bjd

20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ను ఢీకొట్టడానికి నవీన్ పట్నాయక్.. బీజేపీతో జట్టుకట్టారు. కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ ను మట్టికరిపించారు. ఆ తర్వాత కందమాల్ లో మతవిద్వేషాలు చెలరేగడంతో.. బీజేపీని పక్కన పెట్టేశారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. ప్రతి ఎన్నికకు  బీజేడీ బలం పెరుగుతూ పోయిందే తప్ప ఎప్పుడూ తగ్గలేదు. ఒడిశాలో బీజూ జనతాదళ్ దెబ్బకు కాంగ్రెస్ కుదేలైపోయింది. అదే సమయంలో బీజేపీ నెమ్మది నెమ్మదిగా పుంజుకుని.. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటునే బీజేపీ, కాంగ్రెస్ నమ్ముకున్నాయి. తాజా సర్వేలు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే నవీన్ కి ఇబ్బంది అని చెబుతున్నాయి. దీంతో నవీన్ కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు.

Image result for naveen patnaik bjd

ప్రధానంగా పశ్చిమ ఒడిశాలోనే వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీనిని తగ్గించేందుకు నవీన్ ఆప్రాంతం మీద దృష్టిసారించారు. ఈ క్రమంలోనే తన సీటును మార్చుకోవాలని నవీన్ భావిస్తున్నారు. ఆయన 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ గంజాం జిల్లాలోని హింజిలికట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి మాత్రం పశ్చిమ ఒడిశాలోని బార్ గర్ జిల్లాలోని బీజేపూర్ నియోజవర్గం నవీన్ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. సంబల్ పూర్, బార్ గర్, బోలన్ గిర్, కలహండి జిల్లాలో బీజేపీ పట్టు సంపాదించింది. 2017 పంచాయతీ ఎన్నికల్లో ఈ జిలాల్లో జెడ్పీ ఛైర్మన్ పీఠాలను బీజేపీయే గెల్చుకుంది. దీంతో నవీన్ ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని.. కాబట్టి గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు నవీన్ పట్నాయక్.


మరింత సమాచారం తెలుసుకోండి: