విజయనగరం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ. ఆయన కాంగ్రెస్ లో ఉన్నపుడు రాజకీయాలను శాసించారు. విభజన సమయంలో కూడా ఆయన పోటీ చేస్తే బాగానే ఓట్లు రావడమే కాదు, ప్రధాన పార్టీలకు ధీటుగా నిలిచారు.


ఇక వైసీపీలో చేరిన ఆయన ఆ పార్టీలోనూ హవా చూపిస్తూ వచ్చారు. జగన్ కి అత్యంత సన్నిహితుడైన నేతగా ఉన్న బొత్స విజయనగరంలో మరో మారు తన పట్టుని నిరూపించుకున్నారు. మొత్తం సీట్లు జిల్లాలో తొమ్మిది ఉంటే దాదాపుగా అన్ని సీట్లు తన వారికి ఇప్పించుకుని జిల్లాలో తన రాజకీయం మళ్ళీ మొదలైందని చాటి చెప్పారు. ఇక బొత్స రాజకీయంగానూ ఇపుడు దూకుడు పెంచుతున్నారు. వైసీపీని వీడి మంత్రి పదవి చేపట్టిన సుజయ క్రిష్ణ రంగారావు మీద బొత్స ఇపుడు గురి పెట్టారు. ఆయన్ని ఎలాగైనా ఓడించాలని తన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుని బొబ్బిలిలో నిలిపారు.


అలాగే విజయన‌గరం రాజు అశోక్ ని ఓడించేందుకు కూడా బొత్స తనదైన మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారు. అక్కడ తన సన్నిహితుడు, దగ్గర చుట్టం అయిన బెల్లాల చంద్రశేఖర్ ని వైసీపీ ఎంపీగా బరిలోకి దింపారు. బీసీ వర్గానికి చెందిన చంద్రశేఖర్ అక్కడ అశోక్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక మిగిలిన చోట్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించేందుకు బొత్స రెడీ అయిపోయారు. ఓ విధంగా విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు బొత్స చేస్తున్న ప్రయత్నాలతో టీడీపీ  కి గుండె బేజారతుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: