హిందుపురం లోక్ సభ నియోజకరవర్గంలో వైసిపి అభ్యర్ధి గోరంట్ల మాధవ్ ను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు చేసిన కుట్రలు బద్దలయ్యాయి. మాధవ్ పెట్టుకున్న విఆర్ఎస్ దరఖాస్తు ఆమోదించాలంటే కనీస వ్యవధి మూడు నెలలుండాలనే సాంకేతిక కారణాన్ని అడ్డుపెట్టుకుని మాధవ్ ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవాలని అధికార టిడిపి ప్లాన్ వేసింది.

 

అయితే, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అధికారపార్టీ ప్రయత్నాన్ని కొట్టేసింది. మాధవ్ విఆర్ఎస్ ను వెంటనే ఆమోదించి నామినేషన్ వేయటానికి లైన్ క్లియర్ చేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని ట్రైబ్యునల్ ఆదేశించింది. మరి ట్రైబ్యునల్ ఆదేశాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

మాధవ్ విఆర్ఎస్ దరఖాస్తు ఎందుకింత వివాదాస్పదమైంది ? ఎందుకంటే, హిందుపురం నియోజకవర్గంలో టిడిపికి గట్టి పట్టుంది. ఈ నియోజకవర్గంలో బిసిలదే పై చేయి. అందుకే బిసిల్లో ఉన్న పట్టుకారణంగా టిడిపి గెలుస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో వైసిపి కూడా బిసియే అయిన మాధవ్ ను రంగంలోకి దింపింది. అంతేకాకుండా బిసిల్లో కూడా ఎక్కువ  జనాభా ఉన్న కురబ ఉపకులానికి చెందిన వ్యక్తే మాధవ్. అంతేకాకుండా మాధవ్ కు పోలీసు అధికారిగా మంచిపేరుంది. దాంతో టిడిపి గెలుపు అంత ఈజీ కాదనేది అర్ధమైపోయింది.

 

విఆర్ఎస్ ఆమోదం పొందకుండా మాధవ్ నామినేషన్ వేసేందుకు లేదు. అందుకనే సాంకేతిక కారణాలు చూపి మాధవ్ విఆర్ఎస్ ను తొక్కిపెట్టేందుకు  ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన మాధవ్ ట్రైబ్యునల్ కు వెళ్ళారు. దాంతో ట్రైబ్యునల్ ప్రభుత్వానికి బాగా తలంటింది.

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: