జనసేన పార్టీలో అధినేత పవన్ కల్యాణ్ అన్న నాగబాబు చేరిక ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపింది. అన్నయ్య చేరడం చేరడంతోపాటే ఆయనకు నరసాపురం ఎంపీగా పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ అవకాశం కూడా కల్పించేశారు. తనకు పవన్ తమ్ముడే అయినా నా నాయకుడు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

nagababu join janasena కోసం చిత్ర ఫలితం


ఐతే.. జనసేనలో నాగబాబు చేరిక ఆ పార్టీకి బలమా.. బలహీనమా అన్న చర్చ మొదలైంది. అయితే అది బలమే అంటున్నారు కొందరు విశ్లేషకులు. నాగబాబు పవన్ కల్యాణ్ అంత కాకపోయినా టీవీ షో ల ద్వారా బాగా పాపులర్ అయిన వ్యక్తి. జనాకర్షణఉన్న వ్యక్తి. 

సంబంధిత చిత్రం

అలాగే నాగబాబు చాలాసార్లు క్రైసిస్ మేనేజ్ మెంట్ చేశారు. చిరంజీవికీ అభిమానులకూ మధ్య వారధిగా పని చేశారు. ఆ అనుభవం కచ్చితంగా జనసేనకు ఉపయోగ పడుతుందని కొందరు చెబుతున్నారు. పార్టీ నిర్మాణంలో నాగబాబు క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 

nagababu join janasena కోసం చిత్ర ఫలితం

ఐతే.. ఇక్కడే ఇంకో చిక్కు కూడా ఉంది. ఇప్పటి వరకూ జనసేన ఇతర పార్టీలకు భిన్నంగా వస్తోంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల పెత్తనం వంటి అపవాదులు జనసేనకు లేవు. ఇప్పుడు నాగబాబుకు పార్టీలో చోటివ్వడం.. వచ్చీరాగానే ఎంపీ స్థానం కేటాయించడం విమర్శలకు తావిచ్చే అవకాశం కూడా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: