కర్నూల్ జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెలుంగుహలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఒకప్పుడు ఈ నియోజకవర్గం ఫ్యాక్షన్ తో తల్లడిల్లిపోయింది. ప్రస్తుతం ప్రజలు అభివృధి కోరుకోవడంతో శాంతి కుసుమలతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ, వైసీపీ ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. 2009 జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి 13,686 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


అప్పుడు ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి చల్లా రామకృష్ణారెడ్డి పోటీ చేయగా, టీడీపీ నుంచి ఏర్రబోతుల వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే గెలిచిన అనంతరం ఆయన పీఆర్పీ పార్టీనీ వీడి వైసీపీ పార్టీలో చేరారు. 2014 లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన ప్రత్యర్థి అయిన టీడీపీ పార్టీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. బీసీ జనార్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గానికి మంచి అభివృధి పనులు చేపట్టారు అని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికార నేత చంద్రబాబును అడిగి నిధులు కేటాయించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచారని మంచి పేరు తెచ్చుకున్నారు.


అలాగే ఈసారి కాటసాని రామిరెడ్డి కూడా ఎలాగైనా గెలవాలనే ఆకాంక్ష తో ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ పార్టీ టికెట్ ఖరారు అయిపోయాయి. టీడీపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్ రెడ్డి కే పార్టీ టికెట్ ను కట్టబెట్టారు. ఇటు వైపు వైసీపీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి కే టికెట్ ఖరారు చేసారు. ప్రధానంగా వీరిద్దరి మధ్యే గత ఎన్నికల్లో పోటీ జరుగగా బీసీ విజయం సాధించారు.


అయితే ఈసారి కూడా విజయం తనదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనకు శ్రీరామరక్ష అంటున్నారు. అటు వైపు ఈసారి ఈ నియోజకవర్గంలో తమ పాగా వేయాలని కాటసాని కసితో ఉన్నారు. మరి జనసేన పార్టీ బరిలో ఉంటుంది లేదో తెలియరాలేదు. ఈ ఎన్నికల్లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: