విశాఖ జిల్లాలో ఆసక్తిని కలిగించే సీటు భీమునిపట్నం. ఈ మధ్య కాలంలో భీమిలీ ఏపీవ్యాప్తంగా బాగా నానింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తరువాత టీడీపీ తరఫున మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పోటీ చేస్తారని కూడా అంతా భావించారు. ఇలా భీమిలీ సీట్  ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది.


ఇక లాస్ట్  మినిట్ లో భీమిలీ టీడీపీ టికెట్ మాజీ ఎంపీ సబ్బం హరి దక్కించుకున్నారు. ఆయనకు ఈ ప్రాంతంలో సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే అనూహ్యంగా అయన్ని అభ్యర్ధిని చేయడంతో అసమ్మతి చెలరేగుతోంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన హరి ఇక్కడ గెలిచి తీరుతానని అంటున్నారు. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలు పరిశీలించినపుడు కాపులు, యాదవులు, మత్స్య్సకారులు, నాగ వంశీకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.


ఆయన ఇప్పటికే బరిలోకి దిగిపోయారు. ఒక మారు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇక 2009లో మొదటిసారి ఇక్కడ నుంచి గెలిచిన అవంతికి ఇక్కడ బాగా పరిచయాలు ఉన్నాయి. కాపుల మద్దతు తో పాటు, యాదవుల నుంచి కూడా సహకారం బాగానే అందుతోంది అంటున్నారు. దాంతో అవంతి ఇప్పటికైతే ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ జనసేన టికెట్ పూర్తిగా  ఏ మాత్రం సంబంధం లేని పంచకర్ల సందీప్ కి ఇచ్చారు. ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల లోకల్ జనసేన నాయకుదు అలీవర్ రాయ్ ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.  విజయవాడ వాసిగా పేరున్న వారికి భీమిలీ టికెట్ ఏంటి అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ అయితే ఇక్కడ నామ మాత్రపు పోటీయే. ఇక ప్రధానంగా వైసీపీ, టీడీపీఎల మధ్యన బిగ్ ఫైట్ ఉంటుందంటున్నారు. ఇప్పటికైతే అన్ని విధాలుగా వైసీపీ బాగా ముందుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: