రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవన్న సంగతి తెలిసిందే.. కాంగ్రెస్ కురువృద్ధుడుగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు ఇప్పుడు ఇది అనుభవంలోకి వస్తోంది. ఆయనకు సొంత కుమార్తె నుంచి పోటీ ఎదురవుతోంది. 

kishore vs srithi devi కోసం చిత్ర ఫలితం


మేధావిగా పేరున్న కిషోర్ చంద్రదేవ్ కురుపాం రాజవంశీయుడు.. ఎస్టీ కోటాలో ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు అరకు నుంచి పోటీ చేస్తున్నారు. 
kishore vs srithi devi కోసం చిత్ర ఫలితం

ఐతే.. ఆయన కుమార్తే శృతి దేవి పర్యావరణ ఉద్యమకారణి, సంఘసేవకురాలు. ఆమె పుట్టి పెరిగింది అంతా ఢిల్లీయే.. కాంగ్రెస్ భావజాలంతో ఉండే ఆమె ఇప్పుడు అరకు నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి దిగుతున్నారు. తండ్రిపైనే పోరాటం చేస్తున్నారు.

kishore vs srithi devi కోసం చిత్ర ఫలితం
శృతిదేవిని అంతా కిశోర్ రాజకీయ వారసులుగా ఇంతకాలం అనుకునేవారు. కానీ ఆమె ఇప్పుడు ఏకంగా పోటీదారు అయ్యారు. గతంలో ప్రతి ఎన్నికలోనూ ఆమె తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆమె అవివాహిత కూడా. కానీ ఇప్పుడు తండ్రికే పోటీగా నిలిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: