దివంగత నేత వంగవీటి మోహనరంగా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో పెద్దగా కనబడని రంగా పేరు ఇపుడే ప్రముఖంగా ఎందుకు వినబడుతోంది. ఎందుకంటే, పోయిన ఎన్నికలపుడు రంగా కొడుకు వంగవీటి రాధా వైసిపిలోనే ఉండేవారు. ఈసారి ఎన్నికలకు ముందు అదే రాధా టిడిపిలో జాయినయ్యారు.

 

అయితే, పార్టీలకు అతీతంగా కృష్ణాజిల్లా ప్రత్యేకించి విజయవాడ రాజకీయాలపై రంగా ముద్ర ఉంటుందన్నది అందిరికీ తెలిసిందే.  కాపు నేతలు రంగాను తమ నేతగా చెప్పుకుంటున్నారు కానీ నిజానికి అన్నీ వర్గాల్లోను రంగాకు పట్టుండేది. కాకపోతే మరణం తర్వాత రంగాను కాపు నేత స్ధాయికి దిగజార్చేశారు.

 

మొన్న గుడివాడలో నామినేషన్ వేసిన కొడాలి నాని రంగా విగ్రహానికి పూలమాల వేయటం అందరినీ ఆకర్షించింది. అలాగే మరికొంతమంది వైసిపి నేతలు కూడా రంగాను తమ నేతగా క్లైం చేసుకుంటున్నారు. ఇటు వైసిపి అటు టిడిపి నేతలు పోటీపడి రంగా జపం చేస్తున్నారు. మరి ఎవరిని రంగా ఆశ్వీరదిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: