పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 16 సీట్ల‌లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ క్ర‌మంలో అభ్య‌ర్థుల విష‌యంలో వ్యూహాత్మ‌కంగా సాగుతున్నారు. టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన కేసీఆర్  లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను ఇవాళ ప్రకటించనున్నారు. సుదీర్ఘ‌ క‌స‌ర‌త్తు ఫ‌లితంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీల‌కు చాన్స్ క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌,  ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ సారి సీటు దక్కడంలేదు. 


గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌మ అభ్య‌ర్థుల వివ‌రాల‌ను అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు. అయితే, వివిధ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కేసీఆర్  ఖరారు చేసిన ఎంపీ అభ్యర్థుల వివ‌రాలు ఇవి. ఇప్ప‌టికే క‌రీంన‌గ‌ర్ ఎంపీ వినోద్‌కుమార్ త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మిగిలిన అభ్య‌ర్థులు శుక్ర‌వారం వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 


1. క‌రీంన‌గ‌ర్ - బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్
 2. నిజామాబాద్ -క‌ల్వకుంట్ల క‌విత‌
3. మెదక్  - కొత్త ప్రభాక‌ర్ రెడ్డి
4. జహీరాబాద్ - బీబీపాటిల్‌
5. ఆదిలాబాద్ - న‌గేష్ 
6. వ‌రంగ‌ల్ - ప‌సునూరు ద‌యాక‌ర్‌
7. భువ‌న‌గిరి -బూర‌ న‌ర్సయ్యగౌడ్ 
8. నల్గొండ - గుత్తా సుఖేందర్ రెడ్డి 
9. చెవేళ్ల - డాక్టర్ రంజిత్ రెడ్డి 
10. ఖ‌మ్మం - నామా నాగేశ్వర‌రావు 
11. నాగ‌ర్ క‌ర్నూలు -పి రాములు
12. మ‌హ‌బూబాబాద్ -మాలోతు క‌విత‌
13. పెద్దప‌ల్లి -వివేక్
14. మ‌ల్కాజిగిరి - మర్రి రాజశేఖర్ రెడ్డి
15. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - ఎంఎస్ఎన్ రెడ్డి
16. సికింద్రాబాద్ - త‌ల‌సాని సాయి కిర‌ణ్ యాద‌వ్


మరింత సమాచారం తెలుసుకోండి: