జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే నియోజకవర్గం గంగాధర నెల్లూరు లో రాజకీయం రసకాయంగా మారింది. ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలలోను అసమ్మతి స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత పార్టీలకు కాకుండా అధికార పార్టీ నాయకులకు పనులు చేసిపెడుతున్నరు అంటూ వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.


మరోవైపు టీడీపీ లోనూ అదే పరిస్థితి, ఇంఛార్జి గా ఉన్న కుతూహలమ్మ తనయుడు ఒంటెద్దు పోకడాల పై ద్వితీయస్థాయి నేతలు మండిపడుతున్నరు. ఇలా రెండు పార్టీలలోను దాదాపుగా ఒకే పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీల అభ్యర్థుల పేర్లను నిర్ణయించారు. అధికార పార్టీ టీడీపీ నుంచి కుతూహలమ్మ కొడుకు హరికృష్ణ పేరు ఖరారు చేయగ, ఇటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామికే టికెట్ ఇచ్చారు. ఇక నియోజకవర్గం అభివృధికి ఆమడదూరంలో ఉందని అంటున్నారు. పేరుకే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినా పెత్తనం అంతా రెడ్డి, కమ్మ సామజికవర్గాలాదే అని చెప్తున్నారు.

గత ఎన్నికల్లో సత్యవేడు కు చెందిన నారాయణస్వామి జీ.డి.నెల్లూర్ లో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు టీడీపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ నేత పాదయాత్ర సమయంలో నల్లబెల్లం పై ఉన్న ఆంక్షలను ఎత్తి వేస్తానని అక్కడి కార్మికులకు హామీ ఇచ్చారు. దీనితో రైతులు ఈసారి వైసీపీకి పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తారని నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇక టీడీపీ వైసీపీ లకు గట్టి పోటీని ఇవ్వాలని భావిస్తున్న జనసేన నుంచి యుగంధర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది కానీ అది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఇక్కడి పోటీ మాత్రం రెండు ప్రధాన పార్టీల మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: