రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ఓట్లే చాలా కీలకంగా మారుతోంది. వాళ్ళంటే ఎవరో కాదు తెలంగాణాలో ఉన్న సీమాంధ్రుల ఓట్లు. సీమాంధ్రులకు చెందిన ఓట్లు తెలంగాణాలో సుమారుగా 18.50 లక్షలున్నాయట. ఈ ఓట్లు కూడా తెలంగాణా ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, కుకట్ పల్లి, మల్కాజ్ గిరి , ఉప్పల్, నల్లకుంట, సనత్ నగర్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉన్నారు.  

 

తెలంగాణాలో ఓట్లున్న వారిలో ఏపికి సంబంధించి ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలు, రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల ఓటర్లే ఉన్నారు. పోయిన తెలంగాణా  అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కుకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, ఉప్పల్ లాంటి నియోజకవర్గాల్లో టిడిపికి మాడు పగిలింది. చంద్రబాబునాయుడు ఎంత గొంతు చించుకున్నా  ఓటర్లు కరుణించలేదు.

 

తెలంగాణాలో ఉంటున్న సీమాంధ్ర ఓటర్లే తెలుగుదేశంపార్టీ లేదా కాంగ్రెస్ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఓట్లేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి రేపటి ఎన్నికల్లో కూడా ఏపిలో జరిగే ఎన్నికల్లో టిడిపికి ఓట్లేసే అవకాశాలు తక్కువనే చెప్పాలి. రేపటి ఎన్నికల్లో తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతుండగా ఏపిలో మాత్రం అసెంబ్లీ, లోక్ సభ రెండింటికి ఎన్నికలు జరగబోతున్నాయి.

 

కాబట్టి తెలంగాణాలో ఉంటున్న ఏపి ఓటర్లు ఏపిలో ఓట్లేయటానికే అవకాశాలు ఎక్కువగా ఉందని ఓ అంచనా. పైన చెప్పినట్లుగా 18.50 లక్షల ఓటర్లకు ఇటు తెలంగాణాలోను అటు ఏపిలోనూ ఓట్లున్నాయట. గడచిన నాలుగు ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లో ఒకేసారి పోలింగ్ జరగలేదు. ఇపుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవటం, ఒకేసారి పోలింగ్ జరుగుతుండటంతో సమస్య తలెత్తింది. మరి వాళ్ళు ఎక్కడ ఓట్లేయాలని అనుకుంటారో ? ఎవరికి ఓటేస్తారో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: