రాయలసీమలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ ఒకటి. కర్నూల్ జిల్లాలో అత్యధిక స్థానాలు వైసీపీ పార్టీ సాధించింది. అయితే గత ఎన్నికల్లో అక్కడ వైసీపీ మహిళా నేత శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఫలితాలు రాకముందే ఆమె మరణించడంతో ఆమె కుమార్తె అఖిల ప్రియా ఉపఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆ తరవాత టీపీడీలో చేరి మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. 1956 లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు సిట్టర్ జయరాజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు అధిక సంఖ్యలో ఎన్నికయ్యారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీదే హవా సాగుతుంది. 1989 నుంచి ఒక్కసారి మినహా ఇక అన్ని సార్లు భూమా కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1989 లో భూమాశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత భూమా కుటుంబంలోని నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, అఖిల ప్రియా లు విజయం సాధిస్తూ వచ్చారు.

దీన్నిబట్టి అక్కడ భూమా కుటుంబానికి ఉన్న ఆదరణ ఎంటో చెప్పొచ్చు. పార్టీలకు అతీతంగా టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీల నుంచి విజయం సాధించారు. 2014 లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అఖిల ప్రియా భారీ విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులు వల్ల ఆమె తన తండ్రితో పాటు టీడీపీ లో చేరిపోయారు. తండ్రి మరణం తర్వాత ఆమెకు మంత్రి పదవి లభించింది. గత ఎన్నికల్లో పెద్దగా పోటీ లేకుండా గెలిచిన అఖిల ప్రియా కు ఈ సారి గట్టి పోటీనే ఉండబోతుంది.

వైసీపీ పార్టీ నుంచి గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. టీడీపీ పార్టీ నుంచి అఖిల ప్రియనే పోటీ చేయనున్నారు. అయితే ఇక్కడ 2019 లో పీఆర్పీ పార్టీ పోటీ చేసి విజయం సాధించగా జనసేన కూడా గట్టి అభ్యర్థిని బరిలోకి దించి గెలవాలనే చూస్తుంది. అయితే ఆళ్లగడ్డ ఎవరి అడ్డా అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: