శ్రీశైలం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న బుడ్డా రాజశేఖర్ కే ఈసారి కూడా పార్టీ టికెట్ లభించిన విషయం విదితమే. అయితే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. ఎన్నికలు మరో ఇరవైరోజుల్లో ప్రారంభం కానున్న సమయంలో ఆయన పార్టీ విషయాలు దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే తన భార్య ఆరోగ్యం సరిగా లేదని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

అలాగే తన టికెట్టును తనకు కాకుండా తన తమ్ముడు కి ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అయితే చంద్రబాబునాయుడు కు ఈ విషయం మింగుడు పడలేదు. ఆయన కూడా అదే స్థాయిలో బుడ్డా కు షాక్ ఇచ్చారు.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమ్మకం ఉంచి ఈసారి పార్టీ టికెట్ కేటాయించినప్పటికి బుడ్డా సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, పార్టీ టిక్కెట్ ను ఆయన తమ్ముడికి కాకుండా సీనియర్ నేతలకు ఇచ్చే ఆలోచనలో పడ్డారు. కాంగ్రెసు పార్టీని వీడి టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి కి పార్టీ టికెట్ కట్టపెట్టెందుకు కసరత్తులు జరుతున్నట్టు విశ్వసనీయ సమచారం. బైరెడ్డి గతంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ప్రాతనిథ్యం వహించిన తెలిసిందే.

ఈ తరుణంలో టీడీపీ లోకి చేరుతూ ఉండడంతో శ్రీశైలం టికెట్ ఆయనేకే దక్కవచ్చని టాక్ వినిపిస్తుంది.అమరావతిలో చంద్రబాబునాయుడు తో బుదవారం ఉదయం 9 గంటల సమయంలో కలిసి ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తుంది. ఈ రకంగా బైరెడ్డి శ్రీశైలం నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నట్లే. అయితే అధికారికంగా ఆ నియోజకవర్గం నుంచి పోటీకి బైరెడ్డి నీలపెడుతున్నట్టు త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇలా జరిగితే బుడ్డా రాజశేఖర్ కు గట్టి దెబ్బ తగిలినట్టే. తన వేలితో తానే తన కంటిని పొడుచుకున్నట్లు అయ్యింది పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: