ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నికల సర్వేలేవీ జనసేన ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పలేదు. కానీ ఇప్పటివరకూ ఉన్న పరిస్థితిని చూస్తే కనీసం 5 ఎంపీ సీట్లలో జనసేన చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పవచ్చు..అవి నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, విశాఖ, నంద్యాల స్థానాల్లో చాలా పటిష్టంగా ఉంది. 

nagababu join janasena కోసం చిత్ర ఫలితం


నరసాపురం విషయానికి వస్తే.. నాగబాబురాకతో ఇక్కడ జనసేన బాగా బలపడింది. సామాజిక వర్గపరంగా చూస్తే కనీసం రెండున్నర లక్షల ఓట్లు ఈజీగా పడతాయి. మరో లక్ష వస్తే నాగబాబు గెలుపు ఈజీ. ఇక రాజమండ్రిలో  ఆకుల సత్యనారాయణ పటిష్టంగా ఉన్నారు. విశాఖలో జేడీ కూడా గట్టి పోటీ ఇస్తారు. ఇక్కడ స్థానికేతరులకు , విద్యావంతలకు పెద్దపీట వేస్తారు. ఇది జేడీకి లాభిస్తుంది. 

సంబంధిత చిత్రం

ఇక్కడ గట్టి పోటీదారుగా ఉన్న మురళీ మోహన్ ఈసారి పోటీ నుంచి తప్పుకోడవం కూడా జనసేనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ మురళీమోహన్ కోడలు పోటీ చేస్తోంది. ఇక్కడ సామాజికవర్గాల పరంగా చూసుకున్నా.. నాయకత్వం పరంగా చూసుకున్న ఆకుల గట్టి పోటీదారు అవుతారు. 

spy join janasena కోసం చిత్ర ఫలితం

అమలాపురంలో ఓఎన్‌జీసీ సంస్థల్లో పని చేసిన మాజీ అధికారికి జనసేన టికెట్ ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ ప్రాతంలో కూడా జనసేన బలంగా ఉంది. మరో సీట్ నంద్యాల. పార్టీలను పక్కనపెడితే ఎస్పీవై రెడ్డికి మంచి ఇమేజ్ ఉంది. సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర ఉంది. ఆయన జనసేనలో చేరడం కారణంగా ఇక్కడ జనసేన గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఐదు సీట్లలో జనసేన వైసీపీకి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: