2014 లో జగన్ హవా మాములుగా లేదని చెప్పాలి. అన్ని జాతీయ సర్వేలు జగన్ సీఎం అయిపోతున్నాడని ఘంటాపధంగా చెప్పాయి. అయితే అనూహ్యంగా జగన్ ఓటమి పాలయ్యాడు. చివర్లో చంద్ర బాబు మొత్తం సీన్ నే మార్చేశాడు. ఇప్పుడు ఇదే జగన్ అభిమానులను కలవర పెడుతుంది. జగన్ గెలవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్న చివర్లో చంద్ర బాబు ఎదో ఒకటి చేయగలడని భావిస్తున్నారు. 

Image result for jagan and pavan kalyan

చంద్ర బాబుకు ఉన్న పోల్ మేనేజ్ మెంట్ జగన్ కు లేదని అతని అభిమానులు కూడా ఒప్పుకుంటారు. అయితే జగన్ పాదయాత్ర కు జనాలు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అలాగే పవన్ సభలకు జనాలు బాగా వస్తున్నారు. అయితే జగన్ విషయంలో లోకల్ ఎమ్మెల్యేలు తోలుకొచ్చే జనం, అలాగే జగన్ మీద ఉన్న చరిష్మా తో వచ్చే జనాలు ఉంటారు. ఇక పవన్ విషయంలో ఎమ్మెల్యేలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. కేవలం తన ఇమేజ్ మీద ఆధారపడి జనాలు వస్తుంటారు. 

Image result for jagan and pavan kalyan

అయితే ఇందుకు భిన్నముగా చంద్ర బాబు సభలకు జనాలు అంతగా రారని చెప్పాలి. జగన్, పవన్ సభలతో పోల్చితే జనాలు తక్కువేనని చెప్పి తీరాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. 2014లో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు పట్టుమని 20 మంది కూడా కొన్ని సభలకు రాలేదు. కానీ చంద్ర బాబు 2014 లో సీఎం అయ్యారు. అయితే జగన్ కు , పవన్ కు వచ్చిన జనాలు ఎంతమంది ఓట్లగా మారతారనేది ఇక్కడ అసలు ప్రశ్న. 2009 లో చిరంజీవి సభకు తిరుపతి లో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ చిరంజీవి తిరుపతిలో అయితే గెలిచాడు కానీ మొత్తం మీద ఓడిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: