టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనకు తెలియని రాజకీయాలు కావు. అర్ధం, పరమార్ధం, తాత్పర్యం అన్నీ బాబు కంటే అర్ధం చేసుకునే నాయకుడు కూడా బహుశా ఏపీలో మరొకరు ఉండరు. ఏపీలో ఇపుడేం జరుగుతుందో, ఏం జరగబోతోందో కూడా చంద్రబాబుకు అర్ధమైపోతోంది. అందుకే ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. 



విజయనగరం జిల్లాలోని సాలూరు, చీపురుపల్లి, విజయనగరం రోడ్ షోలలో బాబు చేసిన ప్రసంగాలు ఆయనలోని బేలతనాన్ని బయటపెట్టేస్తున్నాయి. తాను ఓటమి పాలు అవుతానన్న కంగారు ఆయనలో కనిపిస్తోంది. దాంతో ఆయన జగన్ మీద వ్యక్తిగత దూషణలను తీవ్ర స్థాయిలో చేశారు. చిన్నాన్నను ఇంట్లో వాళ్ళే చంపించి నాటకాలు ఆడుతున్నారంటూ జగన్ మీద అభాండాలు వేశారు. జగన్ అధికారంలోకి  వస్తే రేపు ఏపీలోని ప్రజలను కూడా ఇలాగే చంపేస్తారంటూ బెదిరించారు. ఆయన పాలనంతా అరాచకమే అవుతుంది. వీధికొక గూండా పుట్టుకువస్తారంటూ బాబు దారుణమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. జగన్ వస్తే ఏపీలో గూండా రాజ్యమే వస్తుంది. మీరు ఆయనకు ఓటేస్తే చాలు మీ మరణ శాసనం రాసుకున్నట్లేనని కూడా బాబు హెచ్చరించారు.



తాను ఎన్నో అభివ్రుధ్ధి పనులు చేశానని, తన వంటి సుపరిపాలకుడు కావాలో జగన్ లాంటి అరాచక శక్తి కావాలో తేల్చుకోవాలని బాబు పిలుపు ఇచ్చారు. తనను వద్దు అనుకుంటే తాను ఓ దండం పెట్టేసి వూరుకుంటానంటూ బాబు చేసిన హాట్ కామెంట్స్ కూడా తమ్ముళ్లకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. నిజానికి బాబుకు రాజకీయాలే ప్రాణం. వాటిని ఆయన  సులువుగా వదులుకుంటారా. ఇలా చెప్పడం ద్వారా జనాల్లో సింపతీ క్రియేట్ చేసుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు సీన్ మొత్తం అర్ధమైపోయి బాబు ఇలా రంకెలు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి విజయనగరం జిల్లాలో జరిగిన అన్ని రోడ్ షోలకు జనం బాగానే వచ్చారు కానీ బాబు ప్రసంగాలకు స్పందన పెద్దగా రాకపోవడం విశేషం. ఏం తమ్ముళ్ళూ అంటూ బాబు ప్రశ్నలు అడిగినా జనాల నుంచి జవాబు రాకపోవడంతోనే టీడీపీ అధినేత కంగారు పడుతున్నారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: