విశాఖ అంటేనే ప్రశాంత నగరం. ఇక్కడ ఎంపీ సీటు అంటే ప్రతిష్టాత్మకమైనది. ఎందరో మేటి నాయకులు విశాఖ ఎంపీలుగా పనిచేసి రాణించారు. అటువంటి కీలకమైన విశాఖ ఎంపీ సీటు ఇపుడు దేశంలోనే హాట్ టాపిక్ గా ఉంది. ఇక్కడ నుంచి గెలిచి  17వ లోక్ సభకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అన్నది ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది.


లేటెస్ట్ గా బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్ధుల తొలి జాబితాలో విశాఖ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తారని వెల్లడైంది. దీంతో బీజేపీలో కొత్త హుషార్ కనిపిస్తోంది. నిజానికి పురంధేశ్వరి ఇక్కడ నుంచి పోటీకి దిగడం ఇది రెండ‌వసారి. ఆమె 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచే బరిలోకి దిగారు. గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో  బీజేపీలో చేరిన ఆమె విశాఖ సీటునే కోరారు. అయితే అప్పట్లో హరిబాబుని అభ్యర్ధిగా చేయాలని ఆయన రాజకీయ గురువు వెంకయ్యనాయుడుతో పాటు, చంద్రబాబు చేసిన  లాబీయింగ్ వల్ల ఆమెకు టికెట్ దక్కలేదు.


ఇపుడు పొత్తులు లేకపోవడం వల్ల హరిబాబు తప్పుకున్నారు. దాంతో చిన్నమ్మే బీజేపీకి కూడా దిక్కు అయింది. ఇక విశాఖ ఎంపీ అభ్యర్ధుల గురించి చూస్తే టీడీపీ తరఫున దివంగత నేత మూర్తి మనవడు శ్రీ భరత్, వైసీపీ నుంచి రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ, జనసేన నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారిని ఎంపిక చేశారు. ఈ మొత్తం లిస్ట్ లో చూసుకున్నపుడు చిన్నమ్మకు కొంత సానుకూలత ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గతంలో ఆమె ఎంపీగా పనిచేసిన అనుభవం, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం, మోడీ గ్రాఫ్ మళ్ళీ పెరగడం, ఉత్తరాది వారు ఎక్కువగా నగరంలో ఉండడం వల్ల ఓ జాతీయ పార్టీగా బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: