తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో ఈ సారి ఆసక్తికరమైన పోరుజరగనుంది. దానికి కారణం దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె, రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని ఇక్కడ నుండి పోటీ చేయడమే.. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన ఈ సీటులో తెదేపా...ఈ సారి ఎన్నికల్లో భవానీని బరిలోకి దించింది. ఆదిరెడ్డి భవానీ...సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు కోడలు కూడా. ఇక వైసీపీ నుండి రౌతు సూర్యప్రకాశరావు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి అనుశ్రీ ఫిలింస్‌ అధినేత సత్యనారాయణబరిలో ఉన్నారు.  


కాగా, భవానీని బరిలోకి దింపడం ద్వారా ఇక్కడి బీసీ ఓటర్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే భావానికి కుటుంబ అండదండలు గట్టిగా ఉన్నాయి. ఆమె కోసం సోదరుడు రామ్మోహన్నాయుడు, చిన్నాన్న అచ్చెన్నాయుడు కూడా ప్రచారం చేయడం పార్టీకి కలిసిరానుంది. పైగా ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో టీడీపీ శ్రేణులు కూడా గెలుపుకోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఆర్ధికంగా కూడా భవానీకి ఏ మాత్రం ఇబ్బంది లేదు. అలాగే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు బోనస్. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం మైనస్.


అటు వైసీపీ అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావు కూడా బలమైన నేత. 2009లో ఇక్కడ నుండి కాంగ్రెస్ తరుపున గెలిచి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. ఇక గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ ఐదేళ్లలో పార్టీ బలపడటం, జగన్ పాదయాత్ర రౌతుకి ప్లస్ కానున్నాయి. కానీ భవానీకి ఉన్న క్రేజ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువ కావడం రౌతుకు మైనస్. ఇక ఇక్కడ జనసేన నుండి సత్యనారాయణ పోటీ లో ఉన్నారు. కేవలం పవన్ ఇమేజ్ సత్యనారాయణకి ప్లస్. అలాగే ఆర్ధికంగా సత్యనారాయణ బలంగానే ఉన్నారు.

జనసేన పోటీలో ఉన్న తెదేపా-వైకాపాల మధ్యే ప్రధాన ఫైట్ జరగనుంది. ఈ సిటీ నియోజకవర్గంలో బీసీలు కీలకం. వీరిలో తూర్పు కాపులు, క్రైస్తవులు, శెట్టిబలిజలు, కొప్పుల వెలమలు మెజారిటీగా ఉన్నారు. రెండో స్థానంలో కాపులు, దళితులు, మూడో స్థానంలో కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులు ఉన్నారు. బీసీలే ఇక్కడ గెలుపుని డిసైడ్ చేయనున్నారు. మరి చూడాలి చుట్టూ బంధుగణం ఎక్కువ ఉన్న భవానీ గెలుస్తుందో..లేక అనుభవం ఉన్న రౌతు సూర్యప్రకాశరావు గెలుస్తారో...


మరింత సమాచారం తెలుసుకోండి: