విశాఖలోని ఆ సీటు లో టైట్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఇద్దరు ఉద్దండుల మధ్యన పోరు సాగుతోంది. మూడవ పార్టీ కూడా చోటు కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. దాంతో ఈమారు అక్కడ నుంచి ఎవరు నెగ్గురాతా అన్నది ఆసక్తికరంగా ఉంది.


విశాఖ పశ్చిమం సీటులో టీడీపీ నుంచి ప్రభుత్వ విప్, సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ బరిలో ఉన్నారు. మళ్ళ సినీ నిర్మాతగా, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ గా సుపరిచితులు. అంతే కాదు. 2009 ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ దక్కించుకుని వైఎస్సార్ వూపులో ఇక్కడ  గెలిచారు. ఇక గణబాబు ఇప్పటికి రెండు మార్లు ఎమ్మెల్యేగ నెగ్గారు. తండ్రి పెతకంశెట్టి అప్పలనరసిమ్హం రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నరు. ప్రధాన  పార్టీల అభ్యర్ధులు ఇద్దరూ గవర సామాజికవర్గానికి చెందిన వారే. ఇక్కడ ఆ సామాజిక వ‌ర్గం ఎక్కువగా ఉంది.


ఇక జనసేన మద్దతుఒత ఇక్కడ సీపీపీ  నుంచి సీనియర్ నేత జేవీ సత్యనారాయణ మూర్తి పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నో ఉద్యమాలను నిర్వహించిన అనుభవం కలిగిన నేత. ఇక్కడ కాపుల మద్దతు సీపీఐకి ఉంటుందని అంటున్నారు. అటు గణబాబు, ఇటు మళ్ళ ఇద్దరూ ఒకే రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరికీ పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇక గణబాబు ప్లస్ పాయింట్లు స్థానికంగా బలం, బలగం, గతంలో ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చడం, ఫ్లై ఓవరు వంతెన ప్రారంభించడం వంటివి ఉన్నాయి.


మళ్ళ విషయానికి వస్తే తాను ఎమ్మెల్యేగా చేసిన పనులను చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ అక్రమాలను నిలదీస్తున్నారు. గణబాబు ఒక వర్గానికే పరిమితం అయిన తీరుని ఎండగడుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన సీనియర్ నేతలు బెహరా భాస్కరరావు వంటి వారు మద్దతు వైసీపీకి అదనపు బలంగా ఉంది. ఇక్కడ ఒకసరి గెలిచిన వారు మళ్ళీ వరసగా గెలవలేదు. దాంతో ఇపుడు గణబాబుని ఆ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఇదే తన విజయానికి నాంది అంటున్నారు మళ్ళ. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: