ఓటుకు నోటు.. ఈ కేసులోనే ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. తన వాయిస్ తో దొరికిపోయి తెలంగాణ సీఎంతో అనధికారికంగా రాజీకి వచ్చారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా.. అప్పటికప్పుడు అమరావతికి ఉన్నపళంగా వచ్చేశారు. 



అయితే ఈ కేసు వల్ల ఏపీ నష్టపోయింది అక్షరాలా లక్షకోట్లు అన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా చంద్రబాబు చెబుతున్న మాటలే. తెలంగాణ నుంచి లక్ష కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఆయన ప్రకటించారు. నాలుగేళ్ల  పది నెలల కాలం గడిచిన తర్వాత చంద్రబాబు ఈ విషయం చెప్పడం విశేషం. 



మరి నిజంగానే లక్ష కోట్లు రావాల్సి ఉంటే సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నట్టు.. అంటే తాను ఈ విషయంలోవిఫలం అయ్యానని ఒప్పుకుంటున్నారన్నమాట. ఆయన కెసిఆర్ తో పొత్తు పెట్టుకోవడం కోసం తహతహలాడింది కూడా పచ్చి నిజం. ఈ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. 




దేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ ను వదలుకున్న సంగతిని కూడా ఆయన అంగీకరించారు. కాంప్రమైజ్ అయ్యానని కూడా ఆయన అన్నారు. తన మెడకు చుట్టుకున్న ఓటు కునోటు కేసు నుంచి బయటపడడానికి చేసుకున్న రాజీ కోసమే కదా. అంటే చంద్రబాబు చేసిన తప్పు వల్ల ఏపీ నష్టపోయింది అక్షరాలా లక్ష కోట్లు అన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: