కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుంది ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ బాబోరి ప్రచారం.  మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న లోకేష్ బాబు గెలుపే లక్ష్యంగా తెగ ప్రచారం చేస్తున్నాడు.  కాకపోతే ఆయన మాట్లాడే తెలుగు ధాటికి జనాలు మాత్రం తట్టుకోలేక పోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడే ప్రతి పదంలోనూ అచ్చుతప్పులు ఉంటున్నా..సోషల్ మీడియాలో ప్రతిసారీ హల్ చల్ చేస్తున్నా..ఆయన ప్రసంగాల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.  ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నపుడు ఆచీ..తూచీ మాట్లాడాలి..కానీ లోకేష్ బాబోరు మాత్రం తన నోటికి వచ్చిన పదాలు వదులుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రచారంలో కూడా తనదైన శైలి చూపిస్తున్నారు లోకేష్ బాబు.  సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓట్లు అడిగే విధానం చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది.  ప్రచారం వేళ ఎన్నెన్నో చమక్కులు చూపిస్తుంటారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు పడని పాట్లుండవు.  రోడ్డు పై ప్రచారం చేస్తున్న సమయంలో తమకు కనిపించిన ప్రతి చోటకు వెళ్తారు..టీ స్టాల్స్ కి వెళ్లి చాయ్ కాస్తారు..ఇస్త్రీ షాపుకు వెళ్లి ఇస్త్రీ చేస్తారు..ఆటో వద్దకు వెళ్లి ఆటో నడుపుతారు..చెరకు రసం మిషన్ కనిపిస్తే, రసం తీసి సాయం చేస్తారు.  ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. 

తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారి దిగిన నారా లోకేశ్ తన ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఓ బార్బర్ షాప్ కెళ్లి, దువ్వెన, కత్తెర పట్టుకున్నారు. అప్పటికే అక్కడ కటింగ్ చేయించుకునే నిమిత్తం కూర్చునున్న యువకుడికి కటింగ్ చేశారు. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: