వైఎస్ వివేకా హత్య సభ్య సమాజం తలదించుకునేలా - రాజకీయ నాయకులే కాదు - సామాన్య ప్రజలు కూడా నివ్వెరపోయే విధంగా జీవితాన్ని అంతం చేశారు.
బాధిత కుటుంబం మనో వ్యధకు గురయినపుడు - కలత చెందిన ఉన్నపుడు మనిషనే వాడెవరయినా సంయమనం పాటిస్తారు. ఎంత ఆగర్భ శత్రువైనా కనీస సమయం శాంతి పాటిస్తారు.


కానీ... తెలుగు దేశం పార్టీ మాత్రం రిటర్న్ ఎటాక్ మొదలు పెట్టింది.  తెల్లారి నుండే, ప్రెస్ మీట్లు, లైవ్ ఇంటర్వ్యూలతో  ఛెడా-మఢా మాటలతో ఎదురుదాడి చేసింది.  చూసే ఎవరికయినా దేవుడా ఏంటీ ఇది- కనీసం పార్థవ దేహ కార్యక్రమాలు అయ్యేంత వరకైనా ఆగోచ్చుకదా అనుకున్నారు.  ఏదేమయినా ఈ హత్యను రాజకీయంగానే చేశారు-రాజకీయంగానే వాడుతారు అని వైఎస్ఆర్ సిపి అనుమానించినట్లుగానే ... ప్రతి సభలోనూ బాబాయి హత్యని దాచిపెట్టాడని, హత్యా రాజకీయాలు చేస్తున్నాడని సొంత కూతురు కేసు పెడితేనే హత్య ని తెలిసిందని నానా రకాల మాటలు అంటున్నారు. 


వీటన్నింటికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానమిచ్చింది వైఎస్ వివేకానందరెడ్డి తనయ సునితా రెడ్డి. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిట్ వాళ్లు సీఎం తోనూ, డీజీపీతోనూ దర్యాప్తు గురించి మాట్లాడుతూ రాజకీయంగా వాడుకుంటూ..జగన్ మీద ఆరోపణలు చేస్తూ..తమ సొంత మనుషలనే హత్యకు కారకులుగా చిత్రీకరిస్తున్నారని... ఈ దర్యాప్తు మాకు నమ్మకం లేదు సీబీఐ విచారణ జరపాలని ఎలక్షన్ కమీషన్ ను, కేంద్ర హోంశాఖను కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: