మోహన్ బాబు ఆ పేరే ఓ సంచలనం. ఆయన మాట్లాడితే బాంబుల్లాంటి డైలాగులే వదులుతారు. ఆయన ఇంటి పేరు మంచు, మనసు కూడా మంచు అంటారు. కానీ ఆయన ఆవేశపడ్డారో అక్కడ ప్రళయమే. ఆయన నోటి వెంట అగ్ని గోళాలే వెదజల్లుతారు. అటువంటి మోహన్ బాబు ప్రళయ గర్జనే చేశారు. 



ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేందంటూ ఆయన ఈ రోజు తన విద్యా సంస్థల వద్ద ఆందోళన చేపట్టారు. ఇక్కడ మోహన్ బాబు చంద్రబాబుని ఉద్దేశించి వదిలిన డైలాగులు అనీ ఇన్నీ కావు. బాబు మీద పొలిటికల్ ఎన్ కౌంటర్ చేశారు. బాబు వంటి నాటకాలు ఆడే వారు ఎవరూ లేరని కూడా చెప్పుకొచ్చారు. అన్న నందమూరి సభ్యత్వమే పార్టీలో లేకుండా చేసిన ఘనత బాబుదేనని అన్నారు. అంతటితో ఆగకుండా బాబూ గుర్తుంచుకో ఎల్ల కాలం నీదే కాదంటూ హెచ్చరిక కూడా చేశారు.



ఇక టీడీపీలో కొత్త నేస్తం చేస్తున్న  మరో సినీ నటుడు శివాజీ ఇపుడు మోహన్ బాబు  కు కౌంటర్ అటాక్ ఇస్తున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో మోహన్ బాబు చేసిందేంటని నిలదీశారు. ఏపీలో సమస్యలు ఉంటే మోహన్ బాబు ఎక్కడ ఉన్నారని, ఎందుకు మాట్లాడలేదని కూడా గట్టిగా కెలికారు. హక్కులు కాదు, బాద్యతలు కూడా ఉండాలని క్లాస్ పీకారు. బాగానే ఉంది




కానీ పెట్టుకోక పెట్టుకోక శివాజీ ఏకంగా మోహన్ బాబు తోనే పెట్టుకుంటున్నారు. మరి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా చూసుకోవాలి. మోహన్ బాబు ముందు శివాజీ పిల్ల కాకేనని అంటున్నారు. ఆయన ఈ మధ్య మాటలు నేర్చారు. మోహన్ బాబు అయితే టీడీపీలో ఎపుడో చేరి ఎంపీ కూడా అయ్యారు. మరి. వెనకొచ్చిన చెవులతో పొడిచేస్తామంటే మోహన్ బాబు ఊరుకుంటారా.



మరింత సమాచారం తెలుసుకోండి: