గుంటూరు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఎన్నిక‌ల వేళ నాయ‌కుల కోలాహ‌లం పెరిగింది. ముఖ్యంగా కొన్ని కొన్ని ని యోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణి కూడా అంచ‌నాల‌కు అంద‌డం లేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క‌న్నా కూ డా రాజ‌ధాని ప్రాంతంలోని నియోజ‌క‌వ‌ర్గంలో అంచ‌నాలు భిన్నంగా ఉంటున్నాయి. జిల్లాలోని చాలా నియోజ‌వ‌క‌ర్గాల్లో.. టీడీపీ అభ్య‌ర్థులు ఒక‌టికి రెండు సార్లు విజ‌యం సాధించిన నాయ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ప్ర‌ధానంగా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్న ప్ర‌త్తిపాటి పుల్లారావు మంత్రిగా కూడా చ‌క్రం తిప్పుతు న్నారు. ఇప్ప‌టికి 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా విజ‌యాలు సాధించిన పుల్లారావు.. ఇప్పుడు మ‌రోసారి త‌ల‌ప‌డుతున్నారు.  


ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి ఎన్నారై , బీసీ వ‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీకి అవ‌కాశం క‌ల్పించారు జ‌గ‌న్‌. దీంతో ఆమె ఎన్నిక‌ల‌కు దాదాపు ఆరు మాసాలకు ముందుగానే ఇక్క‌డ చ‌క్రం త‌ప్పుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిసి త‌న ప్రాధాన్యాలు తెలిపింది. అదేస‌మ‌యంలో బీసీ కార్డును వినియోగించ‌డం, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, స‌మ స్య‌ల‌ను కూడా ఆమె ఇంటింటికీ ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మ‌హిళా సెంటిమెంటు కూడా వ‌ర్క‌వుట్ అవుతుం ద‌ని అంటున్నారు. ఎన్నారై మ‌హిళ కావ‌డంతో నిధుల‌ను కూడా భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. ప్రతి ఒక్క‌రినీ క‌లుస్తూ.. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇస్తున్నారు. ఎన్నిక‌ల వేళ మ‌రింతగా డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్నారు. 


దీంతో గుంటూరు జిల్లాలోనే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఇక్క‌డ సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకున్నా రెండు భిన్న దృవాలు, అదేవిధంగా మ‌హిళా సెంటిమెంట్, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, ప్ర‌తిప‌క్షంపై సానుభూతి వంటివి పెద్ద ఎత్తున ప‌నిచేస్తాయ‌ని అంటున్నారు. అయితే, సంప్ర‌దాయ టీడీపీ ఓటింగ్ బెస‌క‌లేద‌ని, ప్ర‌త్తిపాటి వెంటే ప్ర‌జ‌లు ఉన్నార‌ని అనే వారు కూడా క‌నిపిస్తున్నారు. ఇక్క‌డి బ‌లాబ‌లాల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూస్తాయి.


బ‌లాబ‌లాలు ఇవీ..
ప్ర‌త్తిపాటి: మ‌ంత్రిగా ఆయ‌న చేసిన అభివృద్ది. నిధుల వినియోగం. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం. సంప్ర‌దాయ ఓటింగ్‌. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు
విడ‌ద‌ల:  బీసీ అనుకూల ఓట్లు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, మ‌హిళా సెంటిమెంట్‌, న‌వ‌ర‌త్నాలు, జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌నే ప్ర‌భావం. 


మరింత సమాచారం తెలుసుకోండి: