2014లో జగన్ ను ఓడించడానికి టీడీపీ పార్టీ ఇటు బీజేపీ ని అటు జనసేన సపోర్ట్ రెండిటిని పొందింది. అప్పుడు జగన్ ఒంటరిగా భరిలోకి దిగాడు. దీనితో చంద్ర బాబు విజయం సులువైంది. లేకపోతే చంద్రబాబు ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అప్పుడు జగన్ హవా అలా ఉండింది. అయితే ఇప్పుడు 2019 లో ఎన్నికలు రసవత్తరంగా మారినాయి. ఇప్పుడు కూడా జగన్ ఒంటరివాడిగానే ఎన్నికల భరిలోకి దిగుతున్నాడు. 

Image result for jagan

అయితే ఇక్కడ తేడా ఏంటంటే టీడీపీ కి సపోర్ట్ గా ఉండే బీజేపీ, జనసేన దూరం అయిపోయాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటికి వచ్చి టీడీపీ మీద అవినీతి మీద కుంభకోణాల మీద విరుచుపడ్డాడో ఒక్క సారిగా రాజకీయాల్లో భూకంపమే సంభవించింది. అదే మాదిరిగా ఆ అవినీతికి బీజేపీ సాక్ష్యాలు చూపించడంతో టీడీపీ ఇబ్బందుల్లో పడి పోయింది. అయితే టీడీపీకి సపోర్ట్ తగ్గింది కానీ జగన్ పార్టీకి ఎటువంటి మద్దతు రాలేదు. 

Image result for jagan

అందుకే చంద్ర బాబుకు పోల్ మేనేజ్ మెంట్ బాగా తెలుసంటారు. ఇప్పుడు జనసేన, సిపిఎం  సిపిఐ అలాగే కాంగ్రెస్ అన్ని పార్టీలు టీడీపీ వదిలి జగన్ మీద ఆరోపణలు చేస్తూ జగన్ ను మళ్ళీ ఒంటరోన్ని చేసేశారు. కొన్ని చోట్లా టీడీపీ కి మరియు జనసేనకు అవగాహన కుదిరిందని చెబుతున్నారు. దీనితో 2014 లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో జగన్ కు ఇప్పుడు అవే పరిస్థితిలు ఉన్నాయని చూపొచ్చు. మరీ చూడాలి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో ..!

మరింత సమాచారం తెలుసుకోండి: