రాహుల్ గాంధి విఙ్జుడో? కాదో? అనుమానాస్పదమే. అసంఖ్యాక భారతీయుల ఆరాధ్య స్వాతంత్ర సమర యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ ముద్దుగా వీర్ సావర్కర్ అని ఒక జాతిచే పిలిపించుకున్న మహనీయుడు హిందూత్వ వాది వీర్ సావర్కర్‌‌ పై ఆయన ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అధినేత అయి ఉండీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ అజ్ఞానంతో చేసిన తప్పుడు ఆరోపణలు సహించని సాక్షాత్తూ ఆయన కుటుంబ సభ్యులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
ranjeet savarkar కోసం చిత్ర ఫలితం
చెరసాల నుంచి విడుదలయ్యేందుకు సావర్కర్ బ్రిటీషర్ల కాళ్లు పట్టుకున్నారనీ, వాళ్లు చెప్పినట్టు నడుచు కుంటానంటూ క్షమాపణలు చెప్పుకున్నారని రాహుల్ గాంధి వ్యాఖ్యానించడాన్ని వీర్ సావర్కర్ కుటుంబ సభ్యులు తప్పుబడుతున్నారు. ఇటీవలే ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సావర్కర్ జైలు నుంచి బయట పడేందుకు బ్రిటీషర్లకు క్షమాపణలు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.
veer savarkar కోసం చిత్ర ఫలితం
అయితే దీనిపై వీర్ సావర్కర్ ముని మనవడు రంజీత్ సావర్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీర్ సావర్కర్‌ను బ్రిటీషర్లు 27 ఏళ్ల పాటు జైల్లో పెట్టారని, వీర్ సావర్కర్ అలాంటి పిరికి వాడే అయితే అంతకాలం చెరసాలలో మ్రగ్గి ఉండేవారు కారని,  అలాంటి వ్యక్తిపై రాహుల్ గాంధి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్‌ ను పనిగట్టుకొని అప్రదిష్టపాలు చేస్తున్న రాహుల్ గాంధీ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
veer savarkar కోసం చిత్ర ఫలితం
రంజీత్ సావర్కర్ ఫిర్యాదుతో ముంబై లోని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌ లో రాహుల్‌ గాంధీ పై కేసు నమోదైంది. ఇకపోతే హిందూత్వ అనే భావాన్ని తొలిసారి ప్రవేశ పెట్టిన వ్యక్తిగా వీర్ సావర్కర్ గుర్తింపు పొందారు. దేశ ప్రజల ఉవ్వెత్తున పొంగే అభిమానాన్ని పోగేసుకున్న్ వీర్ సావర్కర్ ఆత్మాభిమానాన్ని గాని దేశ భక్తిని గాని కించిత్తు శంఖించ వలసిన పని లేదు. అయినా రాహుల్ గాంధి లాంటి వ్యక్తులు ఆయన ముందు "పిపీలికాలు" మాత్రమే అన్నది గమనించాలని ముంబైకర్లు అంటున్నారు.   

Shiv Sena president Uddhav Thackeray (Photo: PTI)

మరింత సమాచారం తెలుసుకోండి: