తెలంగాణ  రాష్ట్ర స‌మితికి సీనియ‌ర్ నేత గుడ్ బై చెప్పారు. పార్టీలో త‌న‌కు జ‌రుగుతున్న ప‌రాభ‌వంపై ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోనందుకే...తానిలా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్. పెద్దపల్లి నుంచి సీటు ఆశించిన మాజీ ఎంపీ వివేక్‌కి నిరాశే ఎదురైంది. పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేతకానికి చోటు కల్పించారు. దీంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  రాజీనామా లేఖను పంపిన వివేక్‌ తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. తాను టీఆర్ఎస్ లో చేరితే 2019 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని.. అయితే ప్రస్తుతం జరిగింది వేరని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు పదవికి మాత్రమే రాజీనామ చేస్తున్నానన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తన తండ్రి వెంకటస్వామి (కాకా) 60 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించారని.. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని అన్నారు. పెద్దపల్లి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు.


ఇదిలాఉండ‌గా,శ‌నివారం గోదావరిఖనిలో  కార్యకర్తలతో సమావేశం అనంతరం వివేక్ నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. బీజేపీలో చేరాలా...కాంగ్రెస్‌లో చేరాలా అనే విష‌యంలో ఆయ‌న తేల్చుకోలేక‌పోతున్నారు. అయితే, వివేక్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు సూచిస్తున్నట్లు స‌మాచారం. కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వివేక్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: