ఈస్ట్ గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం రాజకీయ పరిస్థతులు వేడెక్కాయి. ఇక్కడ అత్యధిక సార్లు టీడీపీ విజయం సాధించింది. అందులో 6 సార్లు యనమల రామకృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేసి 1983 నుంచి 2004 దాకా వరుసగా గెలిచారు. ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. 2014 లో జరిగిన ఎన్నికల్లో యనమల ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన యనమల కృష్ణుడు తన ప్రత్యర్థి అయిన వైసీపీ నేత దాడిసెట్టి రాజ చేతిలో ఓటమి పాలయ్యారు.


2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట కృష్ణంరాజు శ్రీరాజ విజయం సాధించారు. ఇక ఇప్పుడు యనమల ఇప్పుడు ఓడిపోతే వరుసగా మడుసార్లు పరాజయాల పరంపర కొనసాగినట్టు అవుతుంది. మరి ఇలాంటి పరిస్థతుల్లో నుంచి బయటపడేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే అవి అంత ఫలించినట్టుగా కనిపించడం లేదు. అయితే యనమల మాత్రం గతానికి భిన్నంగా పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇలా తాము చేసిన అభివృద్దిని చూపించి ఈసారి అయిన విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.


ఇక వైసీపీ నేత దాడిసెట్టీ రాజ వాదన భిన్నంగా వినిపిస్తుంది. తాను పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా అని, ప్రజలకు ఏ అభివృద్ధి చేయలేక పోయానని అంటున్నారు. ఇందుకు కారణం యనమల సోదరులే అంటు ఆయన ద్వజమెత్తారు. అధికార పార్టీ టీడీపీ అవ్వడంతో, నియోజకవర్గంకు రావాల్సిన నిధులను మంజూరు చేయట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడ తనకు మంచి పేరు వచ్చి మళ్లీ అధికారం సంపాదిస్తానేమో అని వారు భయపడుతున్నారు అని చెప్పారు. అయితే ఈసారి ఇక్కడి జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీ తరుపు నుంచి రాజా అశోక్ బాబు పోటీలోకి దిగుతున్నారు. జనసేన పార్టీకి కూడా ఈ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. దీంతో ఇక్కడ పోటీ మంచి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: